AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బద్దలైన ధోనీ ఆల్‌టైమ్ రికార్డ్.. టీ20 చరిత్రలోనే తోపు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్..!

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన హిస్టరీ క్రియేట్ చేశాడు. టాస్ నాణేన్ని గెలవడంలో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును అధిగమించి, అంతర్జాతీయ పురుషుల టీ20 చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని కొత్త ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

బద్దలైన ధోనీ ఆల్‌టైమ్ రికార్డ్.. టీ20 చరిత్రలోనే తోపు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్..!
Ind Vs Zim Shreyas Iyer Toss Records
Venkata Chari
|

Updated on: Jul 23, 2026 | 5:05 PM

Share

భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రేయస్ అయ్యర్‌కు మైదానంలో ఆశించిన విజయాలు దక్కకపోవచ్చు గానీ, టాస్ విషయంలో మాత్రం అతడి అదృష్టం మైండ్ బ్లాక్ చేస్తోంది. జింబాబ్వేతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో అయ్యర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అయ్యర్‌కు ఇది వరుసగా 8వ టాస్ విజయం కావడం విశేషం. దీంతో ఇప్పటివరకు వరుసగా 7 టాస్‌లు గెలిచి అగ్రస్థానంలో ఉన్న ఎంఎస్ ధోనీ రికార్డును శ్రేయస్ బద్దలు కొట్టాడు.

టాస్ లక్ సూపర్.. కానీ మ్యాచ్ విజయాలేవి?

ఆసక్తికరమైన విషయమేమిటంటే, శ్రేయస్ అయ్యర్ పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలుస్తూనే వచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌ల నుంచి మొదలైన ఈ ‘టాస్ మ్యాజిక్’ జింబాబ్వే పోరు వరకు కొనసాగింది. అయితే, టాస్ అదృష్టం ఎంతగా కలిసివస్తున్నా.. మ్యాచ్ ఫలితాల్లో మాత్రం ఆ అదృష్టం కలసిరావడం లేదు. వరుసగా టాస్‌లు గెలిచినా మ్యాచ్‌లను గెలవలేకపోతున్నాడనే విమర్శలు అయ్యర్‌పై బలంగా ఉన్నాయి.

భారత టీ20 కెప్టెన్లలో వరుస టాస్ విజయాల జాబితా:

శ్రేయస్ అయ్యర్: 8 విజయాలు (2026)

ఎంఎస్ ధోనీ: 7 విజయాలు (2010–2012)

విరాట్ కోహ్లీ: 6 విజయాలు (2019)

రోహిత్ శర్మ: 5 విజయాలు (2020–2022)

టాస్ నాణేన్ని తనవైపు తిప్పుకోవడంలో ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల కంటే ముందంజలో నిలిచిన శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు ఆ అదృష్టాన్ని మ్యాచ్ విజయంగా కూడా మార్చాల్సి ఉంది. జింబాబ్వేపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, ఈ మ్యాచ్‌లో గెలిచి అయ్యర్ కెప్టెన్సీలో బోణీ కొడుతుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? ఆగిపోనున్న సేవలు.. ఎప్పుడంటే..?
యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? ఆగిపోనున్న సేవలు.. ఎప్పుడంటే..?
హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే...
హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే...
రాగి ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే పిండి ఇలా కలపండి..
రాగి ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే పిండి ఇలా కలపండి..
బంగారం ధరల్లో భారీ మార్పు.. గంటల వ్యవధిలోనే ఊహించని ట్విస్ట్
బంగారం ధరల్లో భారీ మార్పు.. గంటల వ్యవధిలోనే ఊహించని ట్విస్ట్
చిన్ని కృష్ణుడి ఫేవరెట్.. బలాన్నిచ్చే మ్యాజిక్ లడ్డు..
చిన్ని కృష్ణుడి ఫేవరెట్.. బలాన్నిచ్చే మ్యాజిక్ లడ్డు..
జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. ఇలా అందంగా రెడీ చేయండి
జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. ఇలా అందంగా రెడీ చేయండి
రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!
రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!
పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న జియో.. టెలికాం రంగంలో మార్పులివే..
పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న జియో.. టెలికాం రంగంలో మార్పులివే..
ఆ బ్లాస్ట్ లో కృష్ణ అయిపోయారు.. బ్రతకడం కష్టం అన్నారు..
ఆ బ్లాస్ట్ లో కృష్ణ అయిపోయారు.. బ్రతకడం కష్టం అన్నారు..