
Best IPL Captain Win Percentage: ఐపీఎల్‌లో 5 సార్లు ట్రోఫీలు గెలిచిన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలను అత్యుత్తమ కెప్టెన్లుగా భావిస్తారు. అయితే, గెలుపు శాతం (Winning Percentage) పరంగా చూస్తే, వీరిద్దరికంటే ముందున్నాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. అయ్యర్ మూడు జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించి, వాటితో ఫైనల్‌కు చేరడం విశేషం. అతని నాయకత్వం వల్ల ప్రతి జట్టులోనూ విజయాలు సాధ్యమయ్యాయి.
ఐపీఎల్‌లో కనీసం 50 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన వారిలో శ్రేయస్ అయ్యర్ టాప్‌లో ఉన్నాడు.
మొత్తం మ్యాచ్‌లు: 87
విజయాలు: 50
ఓటములు: 35
ఫలితం రాలేదు: 2
విన్నింగ్ పర్సెంటేజ్: 58.82%
ఇదే శాతం సచిన్ టెండూల్కర్‌కూ ఉన్నప్పటికీ, ఆయన కేవలం 51 మ్యాచ్‌లకే కెప్టెన్‌గా ఉన్నారు.
ఎంఎస్ ధోనీ – 58.36%
షేన్ వార్న్ – 56.36%
రోహిత్ శర్మ – 56.32%
ఈ గణాంకాలు చూపిస్తున్నాయి శ్రేయాస్ అయ్యర్ గెలుపు శాతం పరంగా ఎంత ముందున్నాడో చెబుతోంది.
మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్ తన రికార్డును మరింత మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్ మార్చి 31న గుజరాత్ టైటాన్స్‌తో జరగనుంది.
గత సీజన్‌లో పంజాబ్ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన అయ్యర్, టైటిల్ మాత్రం చేజార్చుకున్నాడు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ను 2020 ఫైనల్‌కు తీసుకెళ్లి, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో 2024లో టైటిల్ గెలిచాడు.
ఈసారి పంజాబ్ కింగ్స్‌కు తొలి టైటిల్ అందించడమే అయ్యర్ లక్ష్యం. అతని కెప్టెన్సీ రికార్డ్ చూస్తే, ఈసారి కూడా జట్టును విజయవంతంగా నడిపించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..