‘టీ20లకు గుడ్ బై.. 42 ఏళ్లకు 110 సెంచరీలు.. ఇది కోహ్లీ చేయబోయే రికార్డు’..!

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మళ్లీ తిరిగి తన ఫామ్ రాబట్టుకున్నాడు. దాదాపు 3 సంవత్సరాల పాటు ట్రిపుల్ ఫిగర్‌ కోసం పోరాడిన..

టీ20లకు గుడ్ బై.. 42 ఏళ్లకు 110 సెంచరీలు.. ఇది కోహ్లీ చేయబోయే రికార్డు..!
Virat Kohli

Updated on: Mar 21, 2023 | 5:04 PM

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మళ్లీ తిరిగి తన ఫామ్ రాబట్టుకున్నాడు. దాదాపు 3 సంవత్సరాల పాటు ట్రిపుల్ ఫిగర్‌ కోసం పోరాడిన అతడు గత ఏడాది సెప్టెంబర్‌లో T20ల్లో సెంచరీని, ఆపై 2019 తర్వాత టెస్ట్‌ల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఇక ఇదే క్రమంగా అన్ని ఫార్మాట్లలోనూ 100 సెంచరీలు పూర్తి చేయాలంటే.. టీ20 ఫార్మాట్‌ నుంచి కోహ్లీ తప్పుకోవాలని పాకిస్తాన్ మాజీ బౌలర్ ఆసక్తికరమైన సలహా ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. గతంలో ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా ఫైనల్‌లోకి ప్రవేశించింది.

టీ20లకు గుడ్ బై చెప్పి.. టెస్టులు, వన్డేలపై దృష్టిపెడితే.. విరాట్ కోహ్లీ 110 సెంచరీలు చేయగలడని పాక్ బౌలర్ షోయాబ్ అక్తర్ తెలిపాడు. పాక్ వెటరన్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ 6 నుంచి 8 సంవత్సరాల వరకు అంటే 42 సంవత్సరాల వరకు ఆడగలడు. మరో 30 నుంచి 50 టెస్టులు ఆడితే మరో 25 సెంచరీలు సాధించవచ్చు’ అని పేర్కొన్నాడు. కాగా, భారత మాజీ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటిదాకా 75 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 28, వన్డేల్లో 46, టీ20ల్లో 1 సెంచరీ చేశాడు. ఇక ఇప్పుడు కోహ్లీపై కెప్టెన్సీ భారం లేకపోవడంతో.. అతడు ఇంకా దూకుడుగా పరుగులు సాధించగలడని షోయాబ్ చెప్పాడు.