Shivam Dube: రోహిత్ లేదా ధోనీ.. ఎవరు బెస్ట్‌ కెప్టెన్‌? షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన శివమ్‌ దూబె

|

Oct 06, 2024 | 4:55 PM

టీమిండియా క్రికెటర్ శివమ్ దూబె స్వదేశంలో బంగ్లాతో త్వరలో జరిగే మూడు టీ20 సీరిస్‌‌కు ఎంపికైనా గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో శివమ్ దూబె ప్లేస్‌లో తిలక్ వర్మను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ యువ క్రికెటర్ శివమ్ దూబె హిందీలో ఫేమస్ షో అయిన కపిల్ శర్మ షోలో ఆయన పాల్గొన్నాడు

Shivam Dube: రోహిత్ లేదా ధోనీ.. ఎవరు బెస్ట్‌ కెప్టెన్‌? షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన శివమ్‌ దూబె
Shivam Dube Clever Reply
Follow us on

టీమిండియా క్రికెటర్ శివమ్ దూబె స్వదేశంలో బంగ్లాతో త్వరలో జరిగే మూడు టీ20 సీరిస్‌‌కు ఎంపికైనా గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో శివమ్ దూబె ప్లేస్‌లో తిలక్ వర్మను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ యువ క్రికెటర్ శివమ్ దూబె హిందీలో ఫేమస్ షో అయిన కపిల్ శర్మ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిల్ శర్మ ఆయను పలు ప్రశ్నలు అడిగాడు. రోహిత్, ఎంఎస్ ధోనీల్లో ఎవరి కెప్టెన్సీ ఇష్టమని కపిల్ అడుగగా.. తను ఐపీఎల్‌లో సీఎస్‌‌కే తరుపున ఆడినప్పుడు ధోనీ బెస్ట్ సారథి అని, టీమిండియా జట్టు తరుపున ఆడినప్పుడు రోహిత్ బెస్ట్ కెప్టెన్ అని డిప్లమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు దూబే.. ఈ కార్యక్రమంలో దూబెతో పాటు సూర్య కూమార్ యాదవ్, అక్షర్‌పటేల్, రోహిత్ శర్మ పాల్గొన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. శివమ్ దూబె చాలా తెలివిగా సమాధానం చెప్పినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్‌ కూడా దూబె సీఎస్‌కే తరపున ఆడాడు. ఇది ఇలా ఉంటే నేడు స్వదేశంలో బంగ్లాతో భారత్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ గ్వాలియర్‌లో జరగబోతుంది.

బంగ్లా భారత్ టీ20 టీమ్‌లు:

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (కీపర్), అర్ష్‌దీప్ సింగ్ , హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తంజీద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (కీపర్), తౌహీద్ హృదయ్, మహమూద్ ఉల్లా, లిటన్ దాస్ (కీపర్), జాకర్ అలీ అనిక్ (కీపర్), మెహదీ హసన్ మిరాజ్, షాక్ మహేదీ హసన్, రిషాద్ హోస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, తంజీమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్, రకీబుల్ హసన్.