Team India: పరుగెత్తలేడు, డైవ్ చేయలేడు.. టీమిండియాలో అత్యంత వరస్ట్ ఫీల్డర్ అతనే..!

Indian All-Rounder Performance: ఓ ఆల్ రౌండర్ పేలవ ప్రదర్శన టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్, బౌలింగ్, ముఖ్యంగా ఫీల్డింగ్‌లో నిరాశపరిచాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అతని చెత్త ఫీల్డింగ్ స్పష్టంగా కనిపించింది. నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తుండగా, ఇతని భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Team India: పరుగెత్తలేడు, డైవ్ చేయలేడు.. టీమిండియాలో అత్యంత వరస్ట్ ఫీల్డర్ అతనే..!
Shivam Dubes Fielding Fails

Updated on: Sep 19, 2026 | 4:23 PM

Shivam Dubes Fielding Fails: ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు సత్తా చాటింది. క్లీన్ స్వీప్ చేసి ఆకట్టుకుంది. ఇక 3వ మ్యాచ్‌లో ఏకంగా 127 పరుగుల తేడాతో విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్2లో అభిషేక్ శర్మ సెంచరీతో బౌండరీల తుఫాన్ సృష్టించగా, శాంసన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఇక ఛేజింగ్‌లో ఆఫ్ఘాన్ టీం కేవలం 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌట్ అయింది. ఇలా భారీ విజయం దక్కినా, టీమిండియాలో ఓ ఆటగాడి ఫీల్డింగ్‌పై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు ఫీల్డింగ్, అటు బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ విఫలమవ్వడం గమనార్హం. అతను ఎవరో కాదు ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న శివం దుబే.

శివం దుబే ఆల్‌రౌండర్‌గా ప్లేయింగ్ 11లో ఛాన్స్ కొట్టేసిన, ఏ ఒక్క విభాగంలోనూ తన సత్తా చాటలేకపోవడం గమనార్హం. బ్యాటింగ్, బౌలింగ్, ముఖ్యంగా ఫీల్డింగ్‌లో అతని ఆటతీరు విమర్శలకు దారితీస్తోంది. మూడో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించినా, కేవలం 14 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

ఎక్కువమంది చదివినది: ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడంటే..?

ఇవి కూడా చదవండి

ఈ మధ్యకాలంలో శివం దుబే పేలవ ఫామ్‌తో ఉన్నాడనేది స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ తరపున ఆడిన చివరి 5 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయాడు. అతని బౌలింగ్‌లో 6 వికెట్లు మాత్రమే తీశాడు. అయితే ప్రత్యర్థులు అతని బౌలింగ్‌లో హిట్టింగ్‌కు వెళ్లి ఔట్ అవుతున్నారే తప్ప, అతని బౌలింగ్‌లో పదును, వ్యూహం లోపించాయని విశ్లేషకులు కూడా తేల్చిపారేశారు.

ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే, శివం దుబే టీమిండియాలోనే అత్యంత పేలవమైన ఫీల్డర్‌గా చెప్పవచ్చు. బంతి వెనక వేగంగా పరిగెత్తలేకపోవడం, కనీసం డైవ్ కూడా చేయకపోవడం అతని ఫీల్డింగ్ లోపాలను స్పష్టంగా వెల్లడిస్తోంది. అతని పక్క నుంచి బంతి వెళ్తే అది బౌండరీకి వెళ్లాల్సిందే అనే పరిస్థితి నెలకొంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దుబే ఎంత చెత్త ఫీల్డరో అందరికీ అర్థమైంది. సులభంగా ఆపాల్సిన బంతులను కూడా బౌండరీలకు వెళ్లేలా చేసి జట్టుకు అదనపు పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు విపరీతంగా పెరిగాయి.

ఎక్కువమంది చదివినది: IND vs WI: ఆ ముగ్గురికి అర్హత లేనేలేదు.. అయినా వన్డే స్క్వాడ్‌లో చోటిచ్చిన బీసీసీఐ..!

మరోవైపు, నితీష్ కుమార్ రెడ్డి ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశం రాకపోయినా, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించాడు. 3 మ్యాచుల్లో మొత్తం 6 వికెట్లు పడగొట్టి తన సత్తాను చాటాడు. నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ప్రతిభావంతులు రాణిస్తుండగా, శివం దుబేకు వరుసగా అవకాశాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వస్తే దుబే తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

2025లో జరిగిన ఆసియా కప్పు ఫైనల్‌ తర్వాత అతడు పెద్దగా ఆడింది లేదు. అడపా దడపా హిట్టింగ్ చేస్తున్నాడే తప్ప, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడటం లేదు. దుబే పేలవ ఫామ్ కారణంగా, ముఖ్యంగా ఫినిషింగ్ దశలో భారత జట్టు తడబడుతోంది. అతని ప్రస్తుత ప్రదర్శన భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us