ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. శివం దూబే(Shiva dube) మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. దూబే 46 బంతుల్లో 88(5 ఫోర్లు, 8 సిక్స్‌లు)పరుగులు చేశాడు. రాబిన్ ఉతప్పు కూడా చాలా రోజుల తర్వాత క్లాసిక్ ఇన్సింగ్స్ ఆడాడు. అతను 50 బంతుల్లో 88(4 ఫోర్లు, 9 సిక్స్‌లు) పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 17, మొయిన్ అలీ 3 పరుగులు చేసి రనౌట్ కాగా రవీంద్ర జడేజా డకౌట్ అయ్యాడు. ధోనీ బ్యాటింగ్‌కు దిగిన స్ట్రైక్ రాలేదు. హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా, హాజెల్‌వుడ్ ఒక వికెట్ తీశాడు.