Team India: రోహిత్ శర్మతో రూమ్ షేరింగ్.. సీక్రెట్‌గా గర్ల్‌ఫ్రెండ్‌ను గదిలోకి తీసుకువచ్చిన ‘గబ్బర్’..

Shikhar Dhawan Autobiography: శిఖర్ ధావన్ తన ఆత్మకథలో 2006 ఆస్ట్రేలియా పర్యటన సమయంలో రోహిత్ శర్మతో గది పంచుకుంటూ, రహస్యంగా తన ప్రేయసిని గదికి తీసుకువచ్చిన విషయాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మ అసౌకర్యాన్ని వ్యక్తం చేయగా, ధావన్ తన ప్రేమాయణాన్ని కొనసాగించాడు. ఈ సంఘటన జట్టుకు తెలియడంతో ఆటపై ప్రభావం పడిందని ధావన్ పేర్కొన్నాడు.

Team India: రోహిత్ శర్మతో రూమ్ షేరింగ్.. సీక్రెట్‌గా గర్ల్‌ఫ్రెండ్‌ను గదిలోకి తీసుకువచ్చిన గబ్బర్..
Rohit Shikhar

Updated on: Jun 28, 2025 | 3:54 PM

Shikhar Dhawan Autobiography Rohit Sharma Secret: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఆత్మకథ “ద వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్” పుస్తకంలో కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా 2006లో ఇండియా ‘ఏ’ జట్టుతో ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను ధావన్ వివరించాడు. అప్పట్లో రోహిత్ శర్మతో కలిసి ఒకే గదిని పంచుకున్న ధావన్, తన గర్ల్‌ఫ్రెండ్‌ను రహస్యంగా ఆ గదిలోకి తీసుకువచ్చేవాడినని చెప్పుకొచ్చాడు.

ప్రేమలో పడ్డ ధావన్..

2006 ఆస్ట్రేలియా పర్యటనలో ధావన్ ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడట. ఆమెను చూడగానే తను మళ్లీ ప్రేమలో పడ్డానని, ఆమె తన కోసమే పుట్టిందని, ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావించానని ధావన్ తన పుస్తకంలో రాశాడు. ఆ సమయంలో ధావన్ ఆట కూడా బాగానే ఉండేదట. ప్రాక్టీస్ ముగిసిన వెంటనే ఆ అమ్మాయిని కలిసేవాడినని, ఆ తర్వాత రహస్యంగా ఆమెను తన హోటల్ గదికి తీసుకురావడం మొదలుపెట్టానని ధావన్ పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ అసహనం..

ఆ సమయంలో రోహిత్ శర్మ, ధావన్‌తో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. ధావన్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను గదిలోకి తీసుకువచ్చినప్పుడు రోహిత్ శర్మ చాలా ఇబ్బందిపడేవాడట. “నన్ను నిద్రపోనిస్తావా?” అంటూ హిందీలో అసహనం వ్యక్తం చేసేవాడని ధావన్ వివరించాడు. రోహిత్ ఎన్నిసార్లు వ్యతిరేకించినా ధావన్ మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్‌ను గదికి తీసుకురావడం ఆపలేదట.

జట్టుకు తెలిసిన ప్రేమాయణం..

కొన్ని రోజులకు ధావన్ ప్రేమాయణం జట్టు మొత్తానికి తెలిసిపోయిందట. ఒకరోజు సాయంత్రం ధావన్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లగా, తిరిగి వస్తున్నప్పుడు హోటల్ లాబీలో ఒక సీనియర్ సెలెక్టర్ వారిద్దరినీ చూశాడని ధావన్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు కూడా తాను ఆమె చేతిని వదిలిపెట్టలేదని, తానేమీ తప్పు చేయడం లేదనే భావనతో ఉన్నానని ధావన్ చెప్పాడు. ఈ సంఘటనల వల్ల ఆ పర్యటనలో తన ఆటతీరు కొంత దెబ్బతిందని, అదే తన టీమిండియా ఎంట్రీకి ఆలస్యం కావడానికి ఒక కారణమని ధావన్ అభిప్రాయపడ్డాడు.

అయితే, ఈ సంఘటనలు జరిగినప్పటికీ, శిఖర్ ధావన్ ఆ తర్వాత భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగి, అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ధావన్ తన ఆత్మకథలో వెల్లడించిన ఈ విషయాలు ఇప్పుడు క్రీడాభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..