ఊరించి.. ఊసురుమనిపించారు.. కట్ చేస్తే.. 46 ఫోర్లు, 34 సిక్సర్లతో 660 పరుగులు బాదేసిన ధోని సహచరుడు

|

Dec 03, 2022 | 10:50 AM

ఆ ప్లేయర్‌కు టీమిండియా సెలెక్టర్లు ఊరించి.. ఊసురుమనిపించారు. జాతీయ జట్టులోకి చోటు దక్కించుకున్నాడో.. లేదో.. ఇలా తప్పించారు.

ఊరించి.. ఊసురుమనిపించారు.. కట్ చేస్తే.. 46 ఫోర్లు, 34 సిక్సర్లతో 660 పరుగులు బాదేసిన ధోని సహచరుడు
Ruturaj Gaikwad
Follow us on

ఆ ప్లేయర్‌కు టీమిండియా సెలెక్టర్లు ఊరించి.. ఊసురుమనిపించారు. జాతీయ జట్టులోకి చోటు దక్కించుకున్నాడో.. లేడో.. ఇలా తప్పించారు. కట్ చేస్తే.. విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు. ఇంతకీ అతడెవరో కాదు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు.. ఆ జట్టును ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో డబుల్ సెంచరీ.. సెమీఫైనల్‌లో సెంచరీ.. అదే ఊపుతో ఫైనల్‌లో మరో శతకం బాదేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఈ టోర్నీలో ఆడిన చివరి 5 ఇన్నింగ్స్‌ల్లో అతడి బ్యాట్‌ నుంచి వరుసగా మూడోవ సెంచరీ రావడం గమనార్హం.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ట్ర, సౌరాష్ట్ర జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర జట్టుకు.. ఆరంభం అంతగా అచ్చిరాలేదు. 8 పరుగులకే తొలి వికెట్‌ పడింది. ఆ తర్వాత రెండో వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యం నమోదు కాగా.. మూడో వికెట్ మరోసారి త్వరగానే పడింది. స్లో స్టార్ట్‌తో మొదలైన మహారాష్ట్ర ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆదుకున్నాడు. మరో సెంచరీ(108) బాదేసి జట్టుకు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 248 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.

ఇదిలా ఉంటే.. ఈ టోర్నమెంట్‌లో రుతురాజ్‌కు ఇది వరుసగా మూడో సెంచరీ కాగా.. అంతకుముందు అస్సాంతో జరిగిన సెమీ ఫైనల్‌లో 168 పరుగులు, యూపీతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 220 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు రుతురాజ్. ఇక ఫైనల్‌లో 131 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. దీనితో అతడు మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలతో 660 పరుగులు బాదేశాడు. ఇందులో 46 ఫోర్లు, 34 సిక్సర్లు ఉన్నాయి. కాగా, ఫైనల్‌లో సౌరాష్ట్ర జట్టు 5 వికెట్ల తేడాతో మహారాష్ట్రను ఓడించింది. 21 బంతులు మిగిలి ఉండగానే మహారాష్ట్ర నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. హర్విక్ దేశాయ్(50), షెల్డన్ జాక్సన్(133) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..