Virat Kohli: టాప్‌- 5 టెస్ట్‌ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన వార్న్.. కోహ్లీకి ఏ స్థానమిచ్చాడంటే..

|

Dec 12, 2021 | 4:38 PM

కొన్ని రోజుల క్రితం టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీకి బీసీసీఐ పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల కెప్టెన్‌ నుంచి కూడా అతడిని తప్పించి రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పగించింది.

Virat Kohli:  టాప్‌- 5 టెస్ట్‌ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన వార్న్.. కోహ్లీకి ఏ స్థానమిచ్చాడంటే..
Follow us on

కొన్ని రోజుల క్రితం టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీకి బీసీసీఐ పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల కెప్టెన్‌ నుంచి కూడా అతడిని తప్పించి రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పగించింది. బీసీసీఐ నిర్ణయంతో విరాట్‌ ప్రస్తుతం టెస్ట్‌ కెప్టెన్సీకే పరిమితమయ్యాడు. ఈ నిర్ణయం కోహ్లీ ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసిన బ్యాటర్‌గా అతని కెరీర్‌కు మరింత మేలు చేస్తుందని క్రికెట్‌ దిగ్గజాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేర్‌ వార్న్ తన టాప్‌-5 టెస్టు బ్యాటరర్ల జాబితాను ప్రకటించాడు. ఈక్రమంలో గత రెండేళ్లుగా మూడంకెల స్కోరును అందుకోని విరాట్‌ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ‘గతంతో పోల్చుకుంటే విరాట్ జోరు కాస్త తగ్గింది. కానీ అతను నా టాప్‌- 5 జాబితాలో ఉంటాడు’ అని వార్న్‌ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ లిస్టులో టాప్‌ ప్లేస్‌ను ఆసీస్‌ వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు కేటాయించాడు వార్న్‌. ‘ నా దృష్టిలో స్మిత్‌ అమోఘమైన టెస్ట్‌ ఆటగాడు. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా అద్భుతంగా రాణించగలిగే సామర్థ్యం అతని సొంతం. అందుకే స్టీవ్‌కు మొదటి స్థానం ఇచ్చాను’ అని చెప్పుకొచ్చాడీ గ్రేట్‌ స్పిన్నర్‌. ఈ ఏడాదిలో ఆరు టెస్టు సెంచరీలతో పాటు రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన ఇంగ్లండ్‌ ఆటగాడు జోరూట్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో 11 పరుగుల తేడాతో మరో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు రూట్‌. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు మూడో స్థానం దక్కింది. ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కేన్‌ కెప్టెన్సీలోనే కివీస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరగా 5వ స్థానంలో ఆస్ట్రేలియా లేటెస్ట్‌ సెన్సేషన్‌ మార్నస్‌ లబుషేన్‌కు చోటు కల్పించాడు. కెరీర్‌ ప్రారంభించిన అనతి కాలంలోనే టెస్టుల్లో నాణ్యమైన బ్యాట్స్‌మన్‌గా పేరుపొందాడు లబుషేన్‌. ఇప్పటివరకు 19 టెస్టులు ఆడిన మార్నస్‌ 5 సెంచరీలు.. 11 అర్ధ సెంచరీలు సాధించడం విశేషం.

Ashes Series: తుది జట్టు ఎంపిక సరిగా లేదు.. ఆ ఇద్దరిని ఎందుకు తీసుకోలేదు..?

Ishant Sharma: ఇషాంత్‌ శర్మ కెరీర్‌ ముగిసినట్లేనా..! దక్షిణాఫ్రికా పర్యటన చివరిదా..?

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు అప్పుడే చెప్పా.. ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటావని..