యువీ రికార్డును బద్దలుకొట్టిన షకీబ్!

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హాసన్.. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. సోమవారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ బ్యాట‌్‌తో 51 పరుగులు చేసి బంతితో 5 వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లు వేసిన షకీబ్.. ఒక మెయిడిన్ నమోదు చేసి కేవలం 29 పరుగులే ఇచ్చాడు. దీంతో గతంలో యువీ నెదర్లాండ్స్‌పై (50; 5/31) నమోదు చేసిన రికార్డును చెరిపేసి.. షకీబ్ కొత్త రికార్డును సృష్టించాడు. ఇక ఈ […]

యువీ రికార్డును బద్దలుకొట్టిన షకీబ్!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 25, 2019 | 8:22 AM

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హాసన్.. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. సోమవారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ బ్యాట‌్‌తో 51 పరుగులు చేసి బంతితో 5 వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లు వేసిన షకీబ్.. ఒక మెయిడిన్ నమోదు చేసి కేవలం 29 పరుగులే ఇచ్చాడు. దీంతో గతంలో యువీ నెదర్లాండ్స్‌పై (50; 5/31) నమోదు చేసిన రికార్డును చెరిపేసి.. షకీబ్ కొత్త రికార్డును సృష్టించాడు.

ఇక ఈ ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న షకీబ్ ఏడు మ్యాచులకు గానూ 476 రన్స్ చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేవిడ్ వార్నర్(447), జో రూట్(424), ఫించ్(396) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లోనూ 10 వికెట్లు పడగొట్టి షకీబ్ తన సత్తా చాటుకున్నాడు. వరల్డ్‌కప్‌లో పరుగుల వరద పారిస్తున్న షకీబ్ ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. బంగ్లాదేశ్ తరపున ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా ఒక ప్రపంచకప్‌లో ఒక సెంచరీ, 5 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా కపిల్ దేవ్, యువరాజ్ సింగ్ తర్వాత షకీబ్ నిలవడం విశేషం. అంతేకాకుండా వరల్డ్‌కప్‌లో 5 వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లా బౌలర్‌గా షకిబుల్ హాసన్ రికార్డు సృష్టించాడు.