BAN vs SL: లంక ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడని, సొంత ఆటగాడిపై చిందులు.. బంగ్లా సారథిని ఏకిపారేస్తోన్న నెటిజన్లు..

Shakib Al Hasan: సదీర సమరవిక్రమ తర్వాత మాథ్యూస్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, అతను ఒక వైఖరి తీసుకున్నాడు. దీని తర్వాత అతను తన హెల్మెట్ స్ట్రిప్‌ను బిగించాడు, కానీ అది విరిగిపోయింది. తర్వాత మాథ్యూస్ మరో హెల్మెట్ ఆర్డర్ చేశాడు. ఇంతలో, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్, తన జట్టు ఆటగాడి అభ్యర్థన మేరకు, మాథ్యూస్‌పై సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశాడు.

BAN vs SL: లంక ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడని, సొంత ఆటగాడిపై చిందులు.. బంగ్లా సారథిని ఏకిపారేస్తోన్న నెటిజన్లు..
Shakib Al Hasan
Follow us
Venkata Chari

|

Updated on: Nov 07, 2023 | 8:55 PM

Shakib Al Hasan: భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023లో సోమవారం పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏం జరిగిందనేది యావత్ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌పై టైం ఔట్ చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ అప్పీల్‌ను అంగీకరించిన తర్వాత, మాథ్యూస్ ఔట్ అయ్యాడు. దీనిపై వివాదం నడుస్తోంది. అయితే ఇంతలో భిన్నమైన చిత్రం బయటపడింది. మ్యాచ్ తర్వాత, షకీబ్ తన సొంత ఆటగాడిని మందలించడం కనిపిస్తుంది.

సదీర సమరవిక్రమ తర్వాత మాథ్యూస్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, అతను ఒక వైఖరి తీసుకున్నాడు. దీని తర్వాత అతను తన హెల్మెట్ స్ట్రిప్‌ను బిగించాడు, కానీ అది విరిగిపోయింది. తర్వాత మాథ్యూస్ మరో హెల్మెట్ ఆర్డర్ చేశాడు. ఇంతలో, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్, తన జట్టు ఆటగాడి అభ్యర్థన మేరకు, మాథ్యూస్‌పై సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశాడు.

ఇవి కూడా చదవండి

అందుకే షకీబ్‌కి కోపం వచ్చిందా..

దీంతో శ్రీలంక జట్టు మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు మొత్తం బంగ్లాదేశ్ ఆటగాళ్లతో కరచాలనం చేయని పరిస్థితి నెలకొంది. అయితే ఇంతలో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ హడోయ్ రాయ్ శ్రీలంక ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో షకీబ్‌కి కోపం వచ్చింది. రాయ్ ని మందలించాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టుపైనా, షకీబ్‌పైనా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆట స్ఫూర్తిని దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు. మాథ్యూస్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. చివరి క్షణంలో అతని హెల్మెట్ స్ట్రిప్ విరిగిపోవడంతో ఆలస్యమైంది. ఇది గమనించకుండా ఇలా చేయడం క్రీడా స్ఫూర్తికి విదుద్దం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆధారాలు ఇచ్చిన మాథ్యూస్..

ఈ విషయంపై శ్రీలంక జట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను నిర్ణీత సమయంలో అంటే రెండు నిమిషాల్లోనే క్రీజులోకి వచ్చానని, అందుకే టైం ఔట్‌పై అప్పీల్ చేయలేనని ఓ వీడియోను విడుదల చేశాడు. దీంతో అతను అంపైర్లపై ప్రశ్నలు సంధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..