Viral Video : ఏంటి బ్రో చూస్కోవాలి కదా.. ఇప్పుడు చూడు ఏమైందో.. నిన్ను నువ్వే అవుట్ చేస్కుంటివి

ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఫన్నీ ఔట్ ఇది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో షై హోప్ అవుట్ అయిన విధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఔట్ చూసిన క్రికెట్ అభిమానులు, నిపుణులు ఆశ్చర్యపోయి, నవ్వలేక ఉండలేకపోతున్నారు. గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడుతున్న షై హోప్, త్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రేర్ ఫీట్ సాధించాడు.

Viral Video : ఏంటి బ్రో చూస్కోవాలి కదా.. ఇప్పుడు చూడు ఏమైందో.. నిన్ను నువ్వే అవుట్ చేస్కుంటివి
Viral Video

Updated on: Aug 31, 2025 | 12:06 PM

Viral Video : క్రికెట్ ఆట ఎప్పుడు, ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కోసారి ఆటగాళ్లు, బౌలర్లు ఊహించని విధంగా రికార్డులు సృష్టిస్తుంటారు. కానీ అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన, నమ్మశక్యం కాని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఒక సంఘటనే కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో జరిగింది. గుయానా అమేజాన్ వారియర్స్ జట్టుకు చెందిన షాయ్ హోప్ ఔట్ అయిన తీరు చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, నిపుణులు షాక్ అయ్యారు. ఈ విచిత్రమైన ఔట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు హల్​చల్ చేస్తున్నాయి.

మ్యాచ్‌లో షాయ్ హోప్ 28 బంతుల్లో 39 పరుగులతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను బౌండరీలు కొడుతూ జట్టు స్కోర్‌ను పెంచుతున్నాడు. అప్పుడు నైట్ రైడర్స్ బౌలర్ టెర్రన్స్ హిండ్స్ ఒక బంతిని వేశాడు. ఆ బంతి ఆఫ్-స్టంప్‌కు చాలా దూరంగా వైడ్‎గా వెళ్తోంది. హోప్ స్టైలిష్‌గా ఒక రివర్స్ ర్యాంప్ షాట్ ఆడాలని ప్రయత్నించాడు. షాట్ ఆడే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి, తన బ్యాట్‌తో అనుకోకుండా స్టంప్స్‌ను బాదేశాడు. దీంతో బెయిల్స్ కింద పడిపోయాయి.

అంపైర్ నిర్ణయం కోసం చాలాసేపు ఎదురుచూశాడు. చివరకు అంపైర్ అతన్ని హిట్-వికెట్‎గా ఔట్ అని ప్రకటించాడు. ఈ అరుదైన సంఘటన చూసిన కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఔట్ ఇంత విచిత్రంగా ఉండటం వల్ల క్రికెట్ అభిమానులందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.

అసలు ఏం జరిగింది? వైడ్ బంతికి కూడా ఔట్ అవుతారా? అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కొందరు నెటిజన్లు షాయ్ హోప్.. వైడ్ బాల్‌కు కూడా వికెట్ ఇస్తాడా? అని జోకులు వేశారు.

అయితే, హోప్ దురదృష్టవశాత్తూ ఔట్ అయినప్పటికీ, వారియర్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 163 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఈ స్కోరులో రొమారియో షెపర్డ్ (19), డ్వైన్ ప్రిటోరియస్ (21), క్వెన్టిన్ సాంప్సన్ (25) విలువైన పరుగులు సాధించారు. నైట్ రైడర్స్ తరపున అకీల్ హొసేన్ 27 పరుగులకు 3 వికెట్లు, టెర్రన్స్ హిండ్స్ 35 పరుగులకు 2 వికెట్లు తీశారు. టార్గెట్ ఛేదించే క్రమంలో నైట్ రైడర్స్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (74), కొలిన్ మున్రో (52) 116 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పి జట్టు విజయాన్ని సులభతరం చేశారు. నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్రికెట్ ఆటలో ఏమైనా జరగొచ్చని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి