
మరికొద్ది గంటల్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రాజ్‌కోట్ వేదికగా ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కీలక ఆటగాళ్లు గాయలపాలవ్వడం.. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో యువ ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్.. ఈ మ్యాచ్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. అలాగే మంగళవారం వీరిద్దరూ నెట్స్‌లో కఠోరంగా శ్రమించడం.. దీనికి సంకేతం అని చెప్పొచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ వీరిద్దరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నెట్స్‌లో వీరి బ్యాటింగ్ చూడటమే కాదు.. ధృవ్ కీపింగ్‌ను కూడా పర్యవేక్షించాడు రోహిత్.
టీమిండియా మిడిలార్డర్‌లో కీలకంగా మారిన శ్రేయాస్ అయ్యర్‌కు ఉద్వాసన పలకడం.. కెఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం అవ్వడంతో.. సర్ఫరాజ్, ధృవ్ ఆ స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంది. అటు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా విఫలం కావడం.. ధృవ్ జురెల్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటిదాకా పుజారా, కోహ్లీ, రాహుల్.. లాంటి అనుభవం ఉన్న సీనియర్లతో బరిలోకే దిగే టీమిండియా.. మూడో టెస్టులో రజిత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్‌తో మైదానంలోకి దిగబోతోంది. అటు శుభ్‌మాన్ గిల్ వన్ డౌన్.. రోహిత్, యశ్వసి జైస్వాల్ ఓపెనింగ్ దిగబోతున్నారు. ఇక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అటు బౌలర్లకు.. ఇటు బ్యాటర్లకు మధ్య ఓ పిల్లర్‌గా పరుగులు రాబట్టే విషయంలో టీమిండియాకు కీలకం కానున్నాడు. కాగా, కెఎల్ రాహుల్ స్థానంలో మూడో టెస్టుకు దేవదుత్ పడిక్కల్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించారు బీసీసీఐ సెలెక్టర్లు.
𝗗𝗵𝗿𝘂𝘃 𝗝𝘂𝗿𝗲𝗹 – 𝗙𝗶𝗿𝘀𝘁 𝗜𝗺𝗽𝗿𝗲𝘀𝘀𝗶𝗼𝗻𝘀!
Being named in the Test squad 🙂
Day 1 jitters with #TeamIndia 😬
Finding his seat in the bus 🚌Jurel is a mixed bag of fun & emotions!#INDvENG | @dhruvjurel21 | @IDFCFIRSTBank pic.twitter.com/WQryiDhdHG
— BCCI (@BCCI) February 14, 2024
🚨 NEWS 🚨: KL Rahul ruled out of third #INDvENG Test, Devdutt Padikkal named replacement. #TeamIndia | @IDFCFIRSTBank
Details 🔽https://t.co/ko8Ubvk9uU
— BCCI (@BCCI) February 12, 2024