
Sanju Samson credits Jasprit Bumrah: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత జట్టు అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్ పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు ఫైనల్‌లో భారత్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్డేటియంలో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.
ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. భారత ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు అందుకున్నాడు.
ఇషాక్ కిషన్ (Ishan Kishan) – 18 బంతుల్లో 39
శివం దుబే (Shivam Dube) – 25 బంతుల్లో 43
హార్దిక్ పాండ్యా (Hardik Pandya) – 12 బంతుల్లో 27
తిలక్ వర్మ (Tilak Varma) – 7 బంతుల్లో 21
ఈ ఇన్నింగ్స్‌లతో భారత్ 20 ఓవర్లలో 253/7 భారీ స్కోర్ నమోదు చేసింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత సంజూ సామ్‌సన్ వినయంగా మాట్లాడుతూ ఈ అవార్డు నిజానికి జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కు ఇవ్వాలని అన్నాడు.
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను తన 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి అత్యంత ఎకానమికల్ బౌలర్‌గా నిలిచాడు.
సంజూ మాట్లాడుతూ.. “గత మ్యాచ్ నుంచే నాకు ఫామ్ వచ్చిందని అనిపించింది. అందుకే ఇన్నింగ్స్‌ను బాగా నిర్మించాలనుకున్నాను. ఈ అవార్డు బుమ్రాకే చెందాలి. అతను ప్రతీ తరంలో ఒక్కసారి మాత్రమే కనిపించే బౌలర్” అంటూ చెప్పుకొచ్చాడు.
254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఇంగ్లాండ్ మొదట్లోనే ఫిల్ సాల్ట్ (Phil Salt) వికెట్ కోల్పోయింది. అయితే జాకెబ్ బాథెల్ (Jacob Bethell) అద్భుతంగా ఆడి 48 బంతుల్లో 105 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు ఆశలు కలిగించాడు. చివరి ఓవర్లో అతను రన్ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
వెస్టిండీస్‌పై 97 పరుగులు*
ఇంగ్లాండ్‌పై 89 పరుగులు
ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌లలో 232 పరుగులు చేసి సగటు 77.33 నమోదు చేశాడు. అలాగే ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 15 సిక్సర్లు కొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..