AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video : స్థానిక కుర్రాళ్లతో కలిసి సరదాగా క్రికెట్.. చెన్నై బీచ్‌లో సంజూ శాంసన్ సందడి

Watch Video : చెన్నైలోని ఒక బీచ్‌లో స్థానిక యువకులతో కలిసి చాలా సాదాసీదాగా క్రికెట్ ఆడుతున్న సంజు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి భద్రతా సిబ్బంది ఆర్భాటం లేకుండా, ఒక సామాన్యుడిలా అందరితో కలిసిపోవడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Watch Video : స్థానిక కుర్రాళ్లతో కలిసి సరదాగా క్రికెట్.. చెన్నై బీచ్‌లో సంజూ శాంసన్ సందడి
Sanju Samson
Rakesh
|

Updated on: May 13, 2026 | 2:15 PM

Share

Watch Video : టీమిండియా స్టార్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక ఆటగాడు సంజు శాంసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన మైదానంలో చేసిన సిక్సర్ల వల్ల కాదు, గ్రౌండ్ బయట తన సింప్లిసిటీతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. చెన్నైలోని ఒక బీచ్‌లో స్థానిక యువకులతో కలిసి చాలా సాదాసీదాగా క్రికెట్ ఆడుతున్న సంజు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి భద్రతా సిబ్బంది ఆర్భాటం లేకుండా, ఒక సామాన్యుడిలా అందరితో కలిసిపోవడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సంజు శాంసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఇందులో ఆయన చెన్నై సముద్ర తీరంలో స్థానిక కుర్రాళ్లతో కలిసి సరదాగా గడుపుతూ కనిపించారు. గల్లీ క్రికెట్ ఆడుతున్నంత హాయిగా ఆయన బ్యాట్ పట్టి సందడి చేశారు. లక్షల కోట్లు సంపాదించే స్టార్ ప్లేయర్ అయి ఉండి కూడా, ఇంత సింపుల్‌గా ఉండటం ఒక్క సంజుకే సాధ్యం అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ హీరోగా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్నా, తన మూలాలను మర్చిపోకుండా ఉండటం ఆయన ప్రత్యేకత.

ధోనీ రికార్డులు బద్దలు

రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు మారిన తర్వాత సంజు శాంసన్ కెరీర్ మరో మలుపు తిరిగింది. ఎంఎస్ ధోనీ వారసుడిగా వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టిన ఆయన, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం 56 బంతుల్లోనే 115 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. తద్వారా సీఎస్‌కే వికెట్ కీపర్‌గా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ధోనీ (84 పరుగులు) రికార్డును బద్దలు కొట్టారు. సీఎస్‌కే చరిత్రలో సెంచరీ బాదిన తొలి వికెట్ కీపర్‌గా సంజు చరిత్ర సృష్టించారు.

వాంఖడేలోనూ అజేయ సెంచరీ

కేవలం ఢిల్లీపైనే కాదు, ముంబై ఇండియన్స్‌పై వారి సొంత మైదానం వాంఖడేలో కూడా సంజు విశ్వరూపం చూపించారు. 54 బంతుల్లోనే అజేయంగా 101 పరుగులు చేసి, వాంఖడేలో సీఎస్‌కే తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఈ సీజన్‌లో సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ జట్టు విజయాల్లో అత్యంత కీలకంగా మారింది. గణాంకాల ప్రకారం.. సంజు 40 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రతి మ్యాచ్‌లోనూ సీఎస్‌కే విజయం సాధించింది. అదే ఆయన విఫలమైతే జట్టు గెలుపు అవకాశాలు కేవలం 16.7 శాతానికి పడిపోతున్నాయి.

నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్

ప్రస్తుతం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రాబోయే మ్యాచ్‌లు చాలా ముఖ్యం. తదుపరి పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సీఎస్‌కే తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా సంజు శాంసన్ తన ఫామ్‌ను కొనసాగిస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అటు బ్యాటింగ్‌లో రికార్డులు, ఇటు బయట తన మంచి మనసుతో సంజు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us