భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తన ఆటతీరుతో నిత్యం వార్తల్లో నిలిచిన సానియా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడిపోవడం, ఆ వెంటనే పాక్ నటి సనా జావేద్ తో షోయబ్ పెళ్లిపీటలెక్కడం సానియాను కుంగదీశాను.
దీంతో సానియా అడపాదడపా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. షోయబ్‌తో విడాకుల గురించి నేరుగా స్పందించని సానియా సోషల్ మీడియా వేదికగా మాత్రం ఇన్ డైరెక్ట్‌గా పోస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు ఇన్‌స్టాలో కొన్ని ఆసక్తికర పోస్టులు చేసిన సానియా, తాజాగా మరో ఆసక్తికర పోస్టును చేశారు.
ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. ‘ఇంతకు ముందెప్పుడు నేను ఇది చెప్పాలని అనుకోలేదు. కానీ చాలా కొంచమే చెప్పాను. చాలా చెప్పాలని ఉంది. కానీ మౌనంగా ఉన్నాను’ అని అర్థం వచ్చేలా ఓ కొటేషన్‌ను షేర్ చేశారు. దీంతో ఇప్పుడీ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ సానియా ఈ పోస్ట్ ఎందుకు చేశారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే సానియా మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించే అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సానియా, షోయబ్‌లు 2010లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ జంట 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..