IPL 2025: హ్యాండిస్తారా, సంచలనం సృష్టిస్తారా.. ఐపీఎల్ వేలంలోకి అడుగు పెట్టిన లెజెండ్ ప్లేయర్ల కుమారులు

|

Nov 14, 2024 | 5:26 PM

IPL 2025 వేలం నవంబర్ 24 మరియు 25 తేదీలలో జరగనుంది, ఇందులో స్టార్స్ కుమారులు కూడా వీక్షించబడతారు. కొందరి తండ్రి క్రికెటర్ అయితే మరికొందరికి బాలీవుడ్ లో పెద్ద పేరు. ఆయన కుమారుల అమ్మకం అంచనా ఏంటో తెలుసుకుందాం.

IPL 2025: హ్యాండిస్తారా, సంచలనం సృష్టిస్తారా.. ఐపీఎల్ వేలంలోకి అడుగు పెట్టిన లెజెండ్ ప్లేయర్ల కుమారులు
Ipl 2025 Auction
Follow us on

ఐపీఎల్ 2025 వేలానికి రోజులు దగ్గర పడ్డాయి. నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న వేలం కోసం 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ ఆటగాళ్లలో కొంతమంది లెజెండ్‌ల కుమారులు కూడా ఉన్నారు. వారి విధి ఈ మెగా వేలంలో తేలనుంది. ఆ ఆటగాళ్ల తండ్రుల్లో కొందరు క్రికెట్ ప్రపంచంలో పేరుమోస్తే.. మరికొందరు బాలీవుడ్‌ని ఏలుతోన్న స్టార్స్ కూడా ఉన్నారు. అయితే, ఈ ఆటగాళ్ల ఇటీవలి ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వేలంలో అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అర్జున్, అగ్నిల భవితవ్యం తేలనుందా?

ఐపీఎల్ 2025 వేలంలోకి ప్రవేశిస్తున్న లెజెండ్స్ కుమారులలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, విధు వినోద్ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా ఉన్నారు. అర్జున్ టెండూల్కర్‌కు ఇంతకు ముందు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అతను ముంబై ఇండియన్స్‌లో భాగంగా ఉన్నాడు. కానీ, IPL 2025 వేలానికి ముందు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతనిని రిటైన్ చేయలేదు. మరోవైపు అగ్ని చోప్రా తొలిసారిగా ఐపీఎల్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు.

అర్జున్‌కి ఐదు మ్యాచ్‌ల అనుభవం..

అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌తో రూ.30 లక్షలకు చేరాడు. ఈ జట్టుతో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌తో పాటు మరే ఇతర జట్టులోనూ అర్జున్‌కి చోటు దక్కలేదు. ఐపీఎల్ పిచ్‌పై ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2025 వేలంలో అర్జున్ టెండూల్కర్ అవకాశాల గురించి మాట్లాడితే.. ముంబై ఇండియన్స్ మరోసారి అతనిపై పందెం వేయవచ్చు. అర్జున్ ఎడమచేతి వాటం బౌలింగ్ ఆల్ రౌండర్. ఇటీవలి కాలంలో దేశీయ క్రికెట్‌లో అతని ప్రదర్శన కూడా బలంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో, అర్జున్‌ను కొనుగోలు చేసే రేసులో ఈసారి మరికొన్ని జట్లు కూడా ముంబైతో పోటీపడే అవకాశం ఉంది.

అగ్ని చోప్రా బేస్ ధర రూ. 30 లక్షలు..

వినోద్ చోప్రా తనయుడు అగ్ని చోప్రా గురించి మాట్లాడితే, అతను మొదటిసారి ఐపిఎల్ వేలంలో తన పేరును ఉంచాడు. ఇందుకోసం అగ్ని చోప్రా తన బేస్ ధర రూ.30 లక్షలుగా ఉంచుకున్నాడు. అగ్ని 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా అతను సంపాదించిన పేరు ఈసారి IPL వేలంలో అమ్ముడవడానికి సహాయపడుతుందని అంతా భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..