SA vs PAK: డూ ఆర్ డై మ్యాచ్‌లో డీలా పడ్డ పాకిస్తాన్.. సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు పవర్ ప్లేలోనే..

PAK vs SA, WC 2023: ప్రపంచ కప్ 2023లో 26వ మ్యాచ్‌లో పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతోంది. పాకిస్థాన్ జట్టులో హసన్ అలీ స్థానంలో మహ్మద్ వసీం జూనియర్, ఉసామా మీర్ స్థానంలో మహ్మద్ నవాజ్ ప్లేయింగ్-11లో చోటు దక్కించుకున్నారు. అదే సమయంలో కెప్టెన్ బావుమా, స్పిన్నర్ తబ్రేజ్ షమ్సీ, ఫాస్ట్ బౌలర్ లుంగి ఎన్‌గిడి దక్షిణాఫ్రికా జట్టులోకి తిరిగి వచ్చారు.

SA vs PAK: డూ ఆర్ డై మ్యాచ్‌లో డీలా పడ్డ పాకిస్తాన్.. సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు పవర్ ప్లేలోనే..
Pak Vs Sa Live Socre

Updated on: Oct 27, 2023 | 3:17 PM

PAK vs SA Playing 11: ప్రపంచ కప్ 2023లో పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. చెన్నైలోని చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ నిర్ణయం చాలా తప్పని రుజువైంది. సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది. ప్రస్తుతం పాక్ 13 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ 23, రిజ్వాన్ 19 పరుగులతో ఆడుతున్నారు.

రెండు జట్ల ప్లేయింగ్-11లో కీలక మార్పులు..

పాకిస్థాన్ జట్టులో హసన్ అలీ స్థానంలో మహ్మద్ వసీం జూనియర్, ఉసామా మీర్ స్థానంలో మహ్మద్ నవాజ్ ప్లేయింగ్-11లో చోటు దక్కించుకున్నారు. అదే సమయంలో కెప్టెన్ బావుమా, స్పిన్నర్ తబ్రేజ్ షమ్సీ, ఫాస్ట్ బౌలర్ లుంగి ఎన్‌గిడి దక్షిణాఫ్రికా జట్టులోకి తిరిగి వచ్చారు.

టాస్ గెలిచిన అనంతరం కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. మా దృష్టి దీనిపైనే ఉంది. ప్రతి విభాగంలోనూ మెరుగుపడాలి. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో మెరుగయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మా జట్టులో రెండు మార్పులు జరిగాయి. హసన్ అలీ అనారోగ్యంతో ఉన్నాడు. అతని స్థానంలో మహ్మద్ వసీం జూనియర్ నేడు జట్టులో భాగమయ్యాడు. ఉసామా మీర్ స్థానంలో మహ్మద్ నవాజ్ తిరిగి వచ్చాడు.

ప్రొటీస్‌ కెప్టెన్‌ బావుమా మాట్లాడుతూ.. ‘మేం ఇప్పటివరకు మంచి క్రికెట్‌ ఆడాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మంచి లయను సాధించాం. మనం నిరంతరం మెరుగుపడాలి. నేను కూడా ఇక్కడ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి ఉండేవాడిని. ఇది మంచి పిచ్‌గా కనిపిస్తోంది. ఈరోజు మా జట్టులో మూడు మార్పులు జరిగాయి. నేను, తబ్రేజ్ షమ్సీ, ఎన్‌గిడి తిరిగి జట్టులోకి వచ్చాం. రిజా, రబాడ, విలియమ్స్ ఈరోజు ఆడడం లేదు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, మహ్మద్ నవాజ్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వాసిం జూనియర్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్.

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సిన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, గెరాల్డ్ కోయెట్జీ, లుంగి ఎన్‌గిడి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..