SA vs IND: ఇది కూడా క్రికెట్ పిచే.. మ్యాచ్ ఆడాం కదా.. ఇకపై నోరు మూస్తే మంచిది: ఐసీసీ, రిఫరీలపై రోహిత్ ఫైర్..

Rohit Sharma Key Comments on Cape Town Pitch: భారత కెప్టెన్ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'పిచ్‌ను రేటింగ్ చేసేటప్పుడు రిఫరీలు సిద్ధం చేసే చార్ట్‌ను నేను చూడాలనుకుంటున్నాను. మొదటి రోజు నుంచి భారత్‌లో బంతి తిరుగుతుందని మాకు తెలుసు. కానీ, వారు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. మొదటి రోజు నుంచి బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఇలాంటి రేటింగ్‌లు ఇవ్వడం సరికాదంటూ సూచించాడు.

SA vs IND: ఇది కూడా క్రికెట్ పిచే.. మ్యాచ్ ఆడాం కదా.. ఇకపై నోరు మూస్తే మంచిది: ఐసీసీ, రిఫరీలపై రోహిత్ ఫైర్..
Rohit Sharma Comments On Ca
Follow us
Venkata Chari

|

Updated on: Jan 05, 2024 | 11:28 AM

Rohit Sharma Key Comments on Cape Town Pitch: కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా (South Africa Cricket Team)తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు (India Cricket Team) చరిత్ర సృష్టించింది. కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా భారత జట్టు నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వేగవంతమైన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

భారత్‌లో తయారైన పిచ్‌లపై ఇతర జట్లు ఫిర్యాదు చేయనంత కాలం కేప్‌టౌన్‌లాంటి పిచ్‌పై ఆడేందుకు విముఖత లేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. రెండో టెస్టు మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో ఉపయోగించిన పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చినందుకు ICCపై విరుచుకుపడ్డాడు. బ్యాట్స్‌మెన్ సెంచరీ చేసిన ఆ పిచ్‌పై సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చారని, అలాంటి పిచ్‌లు అధ్వాన్నంగా లేవని భారత కెప్టెన్ తెలిపాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ గురించి రోహిత్ శర్మ ఇక్కడ ప్రస్తావించాడు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ, ‘కేప్‌టౌన్ లాంటి పిచ్‌లపై నోరు మూసుకున్నారు. అలాగే, భారత పిచ్‌లపై ఫిర్యాదు చేయనంత కాలం ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు నేను విముఖత చూపను. మమ్మల్ని మేం సవాలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇతర దేశాల జట్లు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు కూడా అక్కడ సవాలు అందించే పిచ్‌లను కనుగొంటారు అంటూ తేల్చి చెప్పాడు.

‘ప్రపంచకప్ పిచ్ సగటు రేటింగ్ కంటే అధ్వాన్నంగా ఉందని నేను ఇప్పటికీ నమ్మను. ఓ బ్యాట్స్‌మెన్ సెంచరీ చేశాడు. ఆ పిచ్ ఎలా చెడ్డది? అంటూ’ రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

భారత కెప్టెన్ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘పిచ్‌ను రేటింగ్ చేసేటప్పుడు రిఫరీలు సిద్ధం చేసే చార్ట్‌ను నేను చూడాలనుకుంటున్నాను. మొదటి రోజు నుంచి భారత్‌లో బంతి తిరుగుతుందని మాకు తెలుసు. కానీ, వారు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. మొదటి రోజు నుంచి బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఇలాంటి రేటింగ్‌లు ఇవ్వడం సరికాదంటూ సూచించాడు.

2010/11 తర్వాత తొలిసారిగా భారత జట్టు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంఎస్ ధోని తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..