IPL 2023: ధోని శిష్యుడా.. మజాకానా.. దెబ్బకు సచిన్ రికార్డు బ్రేక్.. ఐపీఎల్‌లో ఒకే ఒక్కడు..!

|

Apr 01, 2023 | 1:36 PM

ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

IPL 2023: ధోని శిష్యుడా.. మజాకానా.. దెబ్బకు సచిన్ రికార్డు బ్రేక్.. ఐపీఎల్‌లో ఒకే ఒక్కడు..!
రితురాజ్ గైక్వాడ్: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు అత్యధికంగా 149 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 2 అర్ధ సెంచరీలు చేయడంలో విజయం సాధించాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 92 పరుగులు.
Follow us on

ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తుఫాన్ ఇన్నింగ్స్ ఫ్యాన్స్‌కు తెగ ఆకట్టుకుంది. ఈ చెన్నై చిన్నోడు 8 పరుగులతో సెంచరీ మిస్సయినప్పటికీ.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును మాత్రం బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. అలాగే తన అర్ధ సెంచరీని 23 బంతుల్లో పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక దీనితో ఐపీఎల్‌లో రుతురాజ్ కేవలం 37 ఇన్నింగ్స్‌లలో 1299 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో.. ఈ పరుగులే అత్యధికం.

ఇప్పటిదాకా ఈ ఘనత సచిన టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 37 ఇన్నింగ్స్‌లు ఆడి 1271 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును రుతురాజ్ గైక్వాడ్ తన పేరిట రాసుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పం‍త్‌(1184) మూడో స్థానంలో ఉన్నాడు.