Rajasthan Royals vs Lucknow Super Giants Live Score in Telugu: ఐపీఎల్ 2022లో ఆదివారం డబుల్ హెడర్ డే. ఈ సీజన్‌లో రెండు అత్యుత్తమ జట్లు – రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు.. ఈ రోజు రెండవ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం హెట్మెయర్(59 పరుగులు, 36 బంతులు, 1 ఫోర్, 6 సిక్సులు) అద్భుత ఇన్నింగ్స్‌తో 6 వికెట్లు కోల్పోయి 165 చేసింది. దీంతో లక్నో టీం ముందు 166 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. లక్నో బౌలర్లలో హోల్డర్ 2, గౌతమ్ 2, అవేష్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ తరపున హెట్మెయర్ 59 నాటౌట్, పడిక్కల్ 29, అశ్విన్ 28 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
జట్లు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో పటిష్ట ఫామ్‌లో కనిపిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సత్తా చాటుతున్నారు.
లక్నో సూపర్‌జెయింట్ టీం కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించింది.
లక్నో 8వ వికెట్ కోల్పోయింది. చామీర.. చాహల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
లక్నో సూపర్ జెయింట్స్ ఏడో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో క్రునాల్ పాండ్యా బౌల్డ్ అయ్యాడు.
లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. 39 డికాక్ చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
లక్నోసూపర్ జెయింట్స్ ఐదో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో బధోని ఔటయ్యాడు.
లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా ఔటయ్యాడు.
లక్నో సూపర్ జెయింట్స్ మూడో వికెట్ కోల్పోయింది. జాసన్ హోల్డర్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
తొలి ఓవర్లోనే బౌల్ట్ విశ్వరూపం చూపించాడు. తొలి బంతికే కేఎల్ రాహుల్‌ను డకౌట్ చేసిన బౌల్ట్.. రెండో బంతికి గౌతమ్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దీంతో లక్నో టీం కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం హెట్మెయర్(59 పరుగులు, 36 బంతులు, 1 ఫోర్, 6 సిక్సులు) అద్భుత ఇన్నింగ్స్‌తో 6 వికెట్లు కోల్పోయి 165 చేసింది. దీంతో లక్నో టీం ముందు 166 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
18 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. క్రీజులో హెట్మెయర్ 38, అశ్విన్ 27 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి కేవలం 49 బంతుల్లో 66 పరుగుల కీలకమైన భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు.
16 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. క్రీజులో హెట్మెయర్ 19, అశ్విన్ 22 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
12 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 80 పరుగులు చేసింది. క్రీజులో హెట్మెయర్ 12, అశ్విన్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ టీం డస్సెన్ (4) రూపంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. టీం స్కోర్ 67 పరుగుల వద్ద గౌతమ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ టీం పడిక్కల్ (29) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. టీం స్కోర్ 64 పరుగుల వద్ద గౌతమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
రాజస్థాన్ రాయల్స్ టీం సంజూ శాంసన్ (13) రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. టీం స్కోర్ 60 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
7 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 52 పరుగులు చేసింది. క్రీజులో దేవదత్ పడిక్కల్ 27, సంజూ శాంసన్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ టీం జోస్ బట్లర్ (13) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. టీం స్కోర్ 42 పరుగుల వద్ద అవేష్ ఖాన్ బౌలింగ్‌లో బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
3 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 27 పరుగులు చేసింది. క్రీజులో జోస్ జట్లర్ 11, దేవదత్ పడిక్కల్ 14 పరుగులతో పవర్ ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
లక్నో సూపర్ జెయింట్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.