
Rajasthan Royals vs Lucknow Super Giants Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్ 26వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాహుల్ సారథ్యంలోని లక్నో టీం ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్‌జెయింట్స్ ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించలేకపోయింది. ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు తలో 5 మ్యాచ్‌లు ఆడాయి. రాజస్థాన్ 4 విజయాలు, 1 ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కాగా, లక్నో 3 విజయాలతో రెండో స్థానంలో ఉంది. నంబర్ వన్ స్థానానికి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
లక్నో సూప్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(కీపర్), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, రవి బిష్ణోయ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..