ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి, ఫైనల్ టికెట్‌ను దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (RR Vs GT) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో కొన్ని ప్రత్యేక క్షణాలు నెట్టింట్లో సందడి చేశాయి. ఇవి జనాలను కచ్చితంగా నవ్విస్తాయి. అందులో ఒకటి రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చివరి బంతికి రియాన్ పరాగ్ రనౌట్ అవ్వడం కూడా ఉంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్ వికెట్ పడినప్పుడు రవిచంద్రన్ అశ్విన్ స్ట్రైక్‌కి వచ్చాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో చివరి బంతి వైడ్‌గా వెళ్లింది. ఆటువంటి పరిస్థితిలో, నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో నిలబడిన రియాన్ పరాగ్ పరుగు తీశాడు. కానీ, అది వైడ్‌గా వెళ్లడంతో అశ్విన్ దీనిని గమనించలేదు. రియాన్ అలాగే పరిగెత్తుకుంటూ స్ట్రైకర్ ఎండ్ వరకు వచ్చేశాడు. దీంతో అశ్విన్ రియాక్షన్ చూసి కలత చెందాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు కూడా తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలో గుజరాత్ కీపర్ వృద్ధిమాన్ సాహా నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో బంతిని విసరగా రియాన్ పరాగ్ రన్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ వికెట్‌పై సోషల్ మీడియాలో రియాన్ పరాగ్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అతని చర్యలను నెటిజన్లు తప్పుంటూ కామెంట్లు చేస్తున్నారు. రియాన్ పరాగ్ రవిచంద్రన్ అశ్విన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. కానీ, అశ్విన్ స్పందించలేదు. ఇక రియాన్ పరాగ్ నిరాశతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ రెండు పరుగులు చేశాడు.
మరోవైపు, రియాన్ పరాగ్ గురించి మాట్లాడితే, అతను 3 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రాజస్థాన్ రాయల్స్ 188 పరుగులు చేసింది. మరోసారి జోస్ బట్లర్ జట్టుకు అత్యధిక పరుగులు చేసి 89 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరకు ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించగా, గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
Riyan Parag gets runout pic.twitter.com/k8rzf0SjZI
— StumpMic Cricket (@stumpmic_) May 24, 2022
Riyan parag everywhere- pic.twitter.com/vAzjjI1rQn
— Vivek singh Rajput (@Viveksi11) May 24, 2022