RR vs DC Score: ఆకట్టుకున్న అశ్విన్, పడిక్కల్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?

Rajasthan Royals vs Delhi Capitals: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. దీంతో లక్నో టీం ముందు 161 పరుగుల టార్గెట్ ఉంది.

RR vs DC Score: ఆకట్టుకున్న అశ్విన్, పడిక్కల్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?
Rr Vs Dc Live Score Ipl 2022 Match
Follow us

|

Updated on: May 11, 2022 | 9:29 PM

ఐపీఎల్ 2022లో బుధవారం జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ అత్యధికంగా 50, దేవదత్ పడిక్కల్ 48 పరుగులు చేశారు. ఢిల్లీ తరపున చేతన్ సకారియా, అన్రిచ్ నోర్త్యా, మిచెల్ మార్ష్ చెరో 2 వికెట్లు తీశారు. రవిచంద్రన్ అశ్విన్ తన టీ20 కెరీర్‌లో తొలి యాభై పరుగులు చేసిన తర్వాత అవుటయ్యాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 9 పరుగుల వద్ద ర్యాన్ పరాగ్ ఔటయ్యాడు.

జోస్ బట్లర్ రూపంలో రాజస్థాన్‌కు తొలి దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 7 పరుగులు చేసి చేతన్ సకారియాకు వికెట్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బట్లర్ అంతగా షార్ప్‌గా కనిపించలేదు. అతను 11 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ మాత్రమే సాధించగలిగాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్ రెండో వికెట్ భాగస్వామ్యానికి 43 పరుగులు జోడించారు. 19 బంతుల్లో 19 పరుగులు చేసిన తర్వాత జైస్వాల్ మిచెల్ మార్ష్‌కు బలయ్యాడు.

సరిగ్గా 50 పరుగులు చేసిన తర్వాత మిచెల్ మార్ష్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ నంబర్-5లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, అతను కేవలం 6 పరుగులు చేసిన తర్వాత నోర్త్యా బంతికి ఔటయ్యాడు. రియాన్ పరాగ్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేక 5 బంతుల్లో 9 పరుగులు చేసి చేతన్ సకారియాకు బలయ్యాడు.

ఇరు జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), దేవదత్ పడిక్కల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్

Also Read: RR vs DC Live Score, IPL 2022: తడబడిన రాజస్థాన్.. హాఫ్ సెంచరీతో అశ్విన్ దూకుడు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

IPL 2022: 10 మ్యాచ్‌లు..116 పరుగులు.. ఫ్లాప్ షోలా మారిన రూ. 16 కోట్ల ప్లేయర్.. ఏకంగా టోర్నీ నుంచే ఔట్..