‘రాయల్స్’ రాజసం..!

|

Apr 28, 2019 | 6:18 AM

ప్లే‌ఆఫ్ ఆశలు సజీవం రాణించిన ఉనద్కత్‌, శాంసన్‌ మనీష్ పాండే మెరుపులు వృధా ఐపీఎల్ 12వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో.. సన్‌రైజర్స్ ను చిత్తుగా ఓడించింది. జైపూర్ మానసింగ్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల […]

రాయల్స్ రాజసం..!
Follow us on
  • ప్లే‌ఆఫ్ ఆశలు సజీవం
  • రాణించిన ఉనద్కత్‌, శాంసన్‌
  • మనీష్ పాండే మెరుపులు వృధా

ఐపీఎల్ 12వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో.. సన్‌రైజర్స్ ను చిత్తుగా ఓడించింది. జైపూర్ మానసింగ్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. మనీష్ పాండే (61; 36 బంతుల్లో 9×4, 0×6) జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్‌ (2/26), గోపాల్ (2/30), థామస్ (2/28) రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టుకు ఓపెనర్లు అజింక్యా రహానే (39; 34 బంతుల్లో 4×4, 1×6), లివింగ్‌ స్టోన్ (44; 26 బంతుల్లో 4×4, 3×6) మంచి శుభారంభాన్ని అందించారు. ఇక వీరితో పాటు సంజూ శాంసన్ (48 నాటౌట్‌; 32 బంతుల్లో 4×4, 1×6) మెరుపులు తోడవ్వడంతో రాయల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఉనద్కత్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.