RCB vs SRH IPL 2026 Live Score: 100 దాటిన హైదరాబాద్ స్కోర్.. ఇషాన్, క్లాసెన్ కీలక భాగస్వామ్యం

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad, IPL 2026 Live Score Updates: ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో హైదరాబాద్ 13 మ్యాచ్‌లు గెలవగా, బెంగళూరు 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ టై అవ్వగా, ఈ మ్యాచ్ ను ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ ఓవర్‌లో గెలుచుకుంది. ఈ రెండు జట్లు ఎం. చిన్నస్వామి స్టేడియంలో 8సార్లు తలపడగా, ఆర్‌సీబీ ఐదుసార్లు, ఎస్‌ఆర్‌హెచ్ మూడుసార్లు గెలుపొందాయి.

RCB vs SRH IPL 2026 Live Score: 100 దాటిన హైదరాబాద్ స్కోర్.. ఇషాన్, క్లాసెన్ కీలక భాగస్వామ్యం
Rcb Vs Srh Ipl 2026 Live Score

Updated on: Mar 28, 2026 | 8:37 PM

LIVE Cricket Score & Updates

  • 28 Mar 2026 08:37 PM (IST)

    Ishan Kishan Half Century: ఇషాన్ హాఫ్ సెంచరీ

    కెప్టెన్ ఇషాన్ కిషన్ 12వ ఓవర్‌లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్‌లోని రెండో బంతికి ఫ్రంట్-ఫుట్ బౌండరీ కొట్టి, 27 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే కవర్స్ మీదుగా బౌండరీ కొట్టి, తన జట్టు శతకాన్ని పూర్తి చేశాడు.

  • 28 Mar 2026 08:23 PM (IST)

    RCB vs SRH: 9 ఓవర్లకు

    9 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. ఇషాన్ 38, క్లాసెన్ 18 పరుగులతో నిలిచాడు.

  • 28 Mar 2026 07:58 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్..

    హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా కుప్పకూలుతున్నారు. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయారు. నితీష్ కుమార్ రెడ్డి కేవలం 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు.

  • 28 Mar 2026 07:46 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ కేవలం 7 పరుగులకు అవుట్ అయ్యాడు. డఫ్ఫీ తొలి వికెట్ తీసుకోగా.. హైదరాబాద్ ప్రస్తుత స్కోర్ 18 పరుగులు

  • 28 Mar 2026 07:41 PM (IST)

    మొదటి ఓవర్ 7 పరుగులు..

    సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి ఓవర్ లో 7 పరుగులు సాధించింది. అభిషేక్ సిక్స్ కొట్టగా.. ట్రావిస్ హెడ్ ఒక్క పరుగు చేశాడు. అలాగే ఈ ఓవర్ లో బెంగళూరు ఒక రివ్యూ కోల్పోయింది.

  • 28 Mar 2026 07:38 PM (IST)

    రివ్యూ కోల్పోయిన బెంగళూరు

    అభిషేక్ శర్మను అవుట్ చేసే క్రమంలో థర్డ్ అంపైర్ ను రివ్యూ కోరగా.. బంతి బ్యాట్ కు తాకలేదని తేలింది. దీంతో బెంగళూరు తన మొదటి రివ్యూ కోల్పోయింది. ఆ వెంటనే తర్వాతి బంతికి సిక్స్ కొట్టాడు అభిషేక్ శర్మ.

  • 28 Mar 2026 07:15 PM (IST)

    RCB vs SRH Playing XI: ఇరు జట్ల ప్లేయింగ్ XI:

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

  • 28 Mar 2026 07:02 PM (IST)

    RCb vs SRH Toss Update: టాస్ గెలిచిన ఆర్సీబీ

    టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

  • 28 Mar 2026 06:55 PM (IST)

    RCB vs SRH IPL 2026 Live Score: ఆధిపత్యం ఎవరిదంటే?

    ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో హైదరాబాద్ 13 మ్యాచ్‌లు గెలవగా, బెంగళూరు 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ టై అవ్వగా, దానిని ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ ఓవర్‌లో గెలుచుకుంది. ఈ రెండు జట్లు ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఎనిమిది సార్లు తలపడగా, ఆర్‌సీబీ ఐదుసార్లు, ఎస్‌ఆర్‌హెచ్ మూడుసార్లు గెలుపొందాయి.

  • 28 Mar 2026 06:40 PM (IST)

    RCB vs SRH Pitch Report: పిచ్ రిపోర్ట్..

    చిన్నస్వామి స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఉపరితలం చదునుగా ఉండటం వల్ల బంతి సులభంగా బ్యాట్‌పైకి వస్తుంది. ఇది భారీ షాట్లు ఆడటాన్ని సులభతరం చేస్తుంది. చిన్న బౌండరీలు, వేగవంతమైన అవుట్‌ఫీల్డ్ తరచుగా అధిక స్కోరింగ్ మ్యాచ్‌లకు దారితీస్తాయి. అయితే, మ్యాచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు కొంత సహాయం లభించవచ్చు. ఇక్కడ స్పిన్నర్లకు ఎక్కువ టర్న్ లభించదు. కాబట్టి వారు వైవిధ్యాలపై ఆధారపడవలసి ఉంటుంది. రాత్రి మ్యాచ్‌లలో మంచు కూడా గణనీయమైన పాత్ర పోషిస్తుంది.

  • 28 Mar 2026 06:20 PM (IST)

    RCB vs SRH Live Score: స్టేడియంలో 100 మ్యాచ్‌లు

    ఈ స్టేడియంలో మొత్తం 100 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 43 మ్యాచ్‌లలో గెలుపొందగా, మొదట బౌలింగ్ చేసిన జట్టు కూడా 53 మ్యాచ్‌లలో గెలిచింది. నాలుగు మ్యాచ్‌లు కూడా ఫలితం తేలకుండా ముగిశాయి. ఈ మైదానంలో నమోదైన అత్యధిక స్కోరు 287/3గా ఉంది. దీనిని గత సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసింది.

  • 28 Mar 2026 06:10 PM (IST)

    Bengaluru Weather Report: వెదర్ రిపోర్ట్

    ఈ మ్యాచ్ సందర్భంగా బెంగళూరులో వాతావారణం ఎలా ఉందో ఓసారి చూద్దాం. బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఉందని, దీనికి 3 శాతం ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బెంగళూరులో ఉష్ణోగ్రతలు 20 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని, గంటకు 7 కిలోమీటర్ల వరకు గాలుల వేగం వీచే అవకాశం ఉందని అంచనా.

  • 28 Mar 2026 06:00 PM (IST)

    RCB vs SRH Score: హైదరాబాద్, బెంగళూరు పోరుకు అంతా సిద్ధం..

    RCB vs SRH Score: ఐపీఎల్ 19వ సీజన్ నేడు ప్రారంభమవుతోంది. ప్రారంభ మ్యాచ్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఆర్‌సీబీ ప్రస్తుత ఛాంపియన్ కాగా, 10 ఏళ్ల క్రితం ఫైనల్‌లో బెంగళూరును ఓడించి ఎస్‌ఆర్‌హెచ్ టైటిల్ గెలుచుకుంది. 2008లో ప్రారంభమైనప్పటి నుంచి ఏడు జట్లు ఈ టోర్నమెంట్‌ను గెలుచుకోగా, పంజాబ్, ఢిల్లీ, లక్నో తమ తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాయి.

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad, IPL 2026 Live Score Updates: ఐపీఎల్ 19వ సీజన్ నేడు ప్రారంభమవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరు సొంత మైదానమైన ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది.

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి బెంగళూరు తమ తొలి టైటిల్‌ను గెలుచుకుంది. మరోవైపు, హైదరాబాద్ ఆరో స్థానంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.

రెండు జట్ల ప్లేయింగ్ 11..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

Follow Us