Royal Challengers Bangalore vs kolkata knight riders Highlights: ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేసింది. ఇక 139 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా 6 వికెట్లు నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా, సునీల్ నరైన్ రాణించడంతో ఆ జట్టు అద్భుత విజయాన్ని అందుకుని క్వాలిఫైయర్-2లో ఢిల్లీతో తలబడనుంది. ఇక ఈ ఓటమితో బెంగళూరు ఇంటి ముఖం పట్టింది.
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ గెలవడానికి భారీ స్కోరు అవసరమైనే నేపథ్యంలో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే మొదటి నుంచి భారీ షాట్‌లతో జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డారు. అయితే వరుస వికెట్‌లు కోల్పోగానే జట్టు స్కోరు ఒక్కసారిగా నెమ్మదించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్‌లలో ఏడు వికెట్ల నష్టానికి ఆర్‌సీబీ 138 పరుగులు చేసింది. దీంతో కోలక్‌తా విజయానికి 139 పరుగులు చేయాల్సి ఉంది.
ఇందులో గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతుంది. అందులో ఏ జట్టు గెలుస్తుందో అది చెన్నైతో ఫైనల్‌లో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై సహజాంగానే ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ ఐపీఎల్ నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో విజయంతో వీడ్కోలు చెప్పాలని కోహ్లీ కసిగా ఉన్నాడు. ఇక ఇప్పటికే రెండు సార్లు టైటిల్ గెలుచుకున్న కేకేఆర్ ఇప్పుడు మరోసారి టైటిల్‌పై గురి పెట్టింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ విజయం సాధించింది.
ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి.
విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, ఎస్. భరత్ (కీపర్), డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టెన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
కేకేఆర్ విజయం.. ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేసిన కేకేఆర్..
17 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్ నాలుగు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. రాస్తుతం క్రీజ్ లో సునీల్ నరైన్, దినేష్ కార్తీక్ ఉన్నారు.
కేకేఆర్ నిలకడగా ఆడుతుంది ఈ క్రమంలో 15 ఓవర్లకు112 పరుగులు సాధించింది. అలాగే 4 వికెట్లు కోల్పోయింది.
నిలకడగా ఆడుతున్న కోల్‌కత్తా.. రాహుల్ త్రిపాఠి 6 పరుగులకు అవుట్ అయ్యాడు. రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది
స్వల్ప లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కోల్‌కతా తొలి వికెట్‌ను కోల్పోయింది. హర్షల్ పటేల్ విసిరిన బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన శుభమన్ గిల్, డివిలర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
ఆర్సీబీ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన కేకేఆర్ ఆచితూచి ఆడుతోంది. ఇద్దరు ఓపెనర్లు రాణించడంతో జట్టు 8 రన్‌రేట్‌తో దూసుకుకెళుతున్నారు. 5 వికెట్ల నష్టానికి ఎలాంటి వికెట్లు నష్టపోకుండా 40 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో గిల్ (29), వెంకటేష్ అయ్యర్ (12) పరుగులతో ఉన్నారు.
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్‌లలో ఏడు వికెట్ల నష్టానికి ఆర్‌సీబీ 138 పరుగులు చేసింది. దీంతో కోలక్‌తా విజయానికి 139 పరుగులు చేయాల్సి ఉంది.
బెంగళూరు మరో వికెట్ కోల్పోయింది.. సునీల్ నరైన్ విసిరిన 14.2 బంతికి డివిలయర్స్ బౌల్డ్ అయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్‌సీబీ నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో షాబాజ్ అహ్మద్ (5), గ్లెన్ మాక్స్‌వెల్ (13) పరుగులతో కొనసాగుతున్నారు.
జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. సునీల్ నరైన్ విసిరిన 12.2 బంతికి బౌల్డ్ అయి పెవిలియన్ బాట పట్టాడు.
వెంట వెంటనే ఆర్‌సీబీ రెండు వికెట్లు కోల్పోవడంతో జట్టు సారథి కోహ్లీ స్కోరును పెంచే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే 32 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. ఆర్‌సీబీ జట్టు స్కోరు 12 ఓవర్‌లు ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 88 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ ( 39 ), మ్యాక్స్‌వెల్ ( 10 ) పరుగులతో కొనసాగుతున్నారు.
ఆర్సీబీ రెండో వికెట్‌ను కోల్పోయింది. 9 బంతుల్లో 16 పరుగులు సాధించి జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డ శ్రీకర్ భరత్, వెంకటేష్ అయ్యర్ బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
భారీ స్కోరు చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు తొలి వికెట్‌ను కోల్పోయింది. భారీ షాట్‌లతో స్కోరును పెంచే పనిలో పడ్డ దేవదత్ పడిక్కల్ 21 పరుగుల వద్ద లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు.
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్‌సీబీ బ్యాట్సెమెన్ ఆచితూచి ఆడుతున్నారు. చాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీ బాదుతూ జట్టు స్కోరును పెంచుతున్నారు. ఈ క్రమంలోనే 5 ఓవర్‌లకు ఆర్‌సీబీ ఎలాంటి వికెట్లు నష్టపోకుండా 49 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (22), దేవదత్ పడిక్కల్ (21) పరుగులతో కొనసాగుతున్నారు.
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇలా కోల్‌కతా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే క్రమంలో బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకున్నట్లనిపిస్తోంది.
ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి.
విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, ఎస్. భరత్ (కీపర్), డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టెన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, కోల్‌కతా నైడ్ రైటర్స్‌లో ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో 29సార్లు తలపడ్డాయి. వీటిలో కేకేఆర్ 15 సార్లు గెలిస్తే, బెంగళూరుకు 13 విజయాలను సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్‌లో చివరిగా తలపడ్డ మ్యాచ్‌లో రెండు జట్లు చేరో విజయాన్ని దక్కించుకున్నాయి. దీనిబట్టి చూస్తే ఈ రెండు జట్ల మధ్య వార్ చాలా టఫ్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది.