T20 World Cup: వామ్మో ఇదేంటి బాదుడు సామీ.. 104 మీటర్ల దూరం సిక్స్‌.. స్టేడియం దాటి పోయిన బంతి..

|

Oct 19, 2022 | 10:12 PM

కాగా ఈ మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటర్‌ రోవ్‌మన్‌ పావెల్ 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో ఒక బౌండరీ, రెండు సిక్స్‌లు ఉన్నాయి. కాగా ఇందులో ఒక సిక్సర్‌ ఏకంగా 104 మీటర్ల దూరం వెళ్లింది.

T20 World Cup: వామ్మో ఇదేంటి బాదుడు సామీ.. 104 మీటర్ల దూరం సిక్స్‌.. స్టేడియం దాటి పోయిన బంతి..
Rovman Powell
Follow us on

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ క్వాలిఫ్లయర్‌ మ్యాచ్‌లు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. కాగా ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే పరాజయం పాలైన వెస్టిండీస్‌ రెండో పోరులో జింబాబ్వేపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చేసిన కరేబియన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వేను 122 పరుగులకే ఆలౌట్‌ చేసి 31 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సూపర్‌12 ఆశలు సజీవంగా ఉంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటర్‌ రోవ్‌మన్‌ పావెల్ 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో ఒక బౌండరీ, రెండు సిక్స్‌లు ఉన్నాయి. కాగా ఇందులో ఒక సిక్సర్‌ ఏకంగా 104 మీటర్ల దూరం వెళ్లింది. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా కొట్టిన ఈ సిక్స్‌ స్టేడియం అవతల పడింది. ఈ బాదుడును చూసి సహచరుడు అకేల్ హోసేన్‌ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
పావెల్‌తో పాటు జాన్సన్‌ చార్లెస్‌ (45), అకీల్ హొసేన్‌ (23 నాటౌట్‌) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా (3/19), ముజరబానీ (2/38), సీన్‌ విలియమ్స్‌ (1/17) ఆకట్టుకున్నారు. అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. పేసర్లు అల్జరీ జోసఫ్‌ (4/16), జేసన్‌ హోల్డర్‌ (3/12), ఓబెద్‌ మెక్‌కాయ్‌ (1/19), ఓడియన్‌ స్మిత్‌ (1/31) ధాటికి 18.2 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..