Video: రోహిత్ శర్మ vs క్రిస్ గేల్: టీ20 తోపు ఓపెనర్‌ ఎవరు..? కోహ్లీ ఆన్సర్ ఇదే.. వీడియో వైరల్

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. వీరిద్దరిలో అత్యుత్తమ టీ20 ఓపెనర్ ఎవరు? అభిమానుల మధ్య ఎప్పుడూ జరిగే ఈ భారీ చర్చకు విరాట్ కోహ్లీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఐపీఎల్ 19వ సీజన్ సందడి మొదలవుతున వేళ, ఆర్సీబీ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ కోహ్లీ ఎవరిని బెస్ట్ అని చెప్పాడనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Video: రోహిత్ శర్మ vs క్రిస్ గేల్: టీ20 తోపు ఓపెనర్‌ ఎవరు..? కోహ్లీ ఆన్సర్ ఇదే.. వీడియో వైరల్
Rohit Sharma Vs Chris Gayle

Updated on: Mar 16, 2026 | 10:38 AM

ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 28 నుండి క్రికెట్ పండుగ షురూ కానున్న నేపథ్యంలో అన్ని జట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆర్సీబీ షేర్ చేసిన ఈ వీడియోలో విరాట్ కోహ్లీ దిస్ ఆర్ దట్ అనే సరదా ఆట ఆడారు. ఈ ఆట నిబంధనల ప్రకారం, ఇచ్చిన ఇద్దరు ఆటగాళ్లలో ఎవరు బెస్ట్ అనేది చెప్పాలి.

మొదటగా ఆడమ్ గిల్‌క్రిస్ట్ , సునీల్ నరైన్ లలో విరాట్ గిల్‌క్రిస్ట్‌ను బెస్ట్ ప్లేయర్‌గా ఎంచుకున్నారు. ఆ తర్వాత గిల్‌క్రిస్ట్ – ట్రావిస్ హెడ్‌లలో ట్రావిస్ హెడ్‌ను బెస్ట్‌గా చెప్పారు. అయితే అసలైన ట్విస్ట్ చివరిలో ఎదురైంది. టీ 20 క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనర్ ఎవరు? రోహిత్ శర్మనా లేక క్రిస్ గేలా? అని అడిగిన ప్రశ్నకు విరాట్ అస్సలు తడబడకుండా ఏమాత్రం ఆలోచించకుండా క్రిస్ గేల్ అని సమాధానం ఇచ్చారు. రోహిత్ శర్మ భారత అభిమానులకు ఆరాధ్య దైవం అయినప్పటికీ టీ 20 ఫార్మాట్‌లో గేల్ సృష్టించిన విధ్వంసాన్నే విరాట్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి ఆర్సీబీ

గత సీజన్ ఆర్సీబీ అభిమానులకు చిరస్మరణీయమైనది. రజత్ పాటిదార్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి, ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ ముద్దాడింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్‌గా 19వ సీజన్‌లో అడుగుపెడుతోంది. ఐపీఎల్ 19వ సీజన్ తొలి రోజే ఆర్సీబీ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది. సొంత గడ్డపై ఆడుతుండటం, పైగా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Follow Us