Team India: ‘పేరుంటే సరిపోదు.. ఆ స్థాయి ప్రదర్శన కూడా ఉండాలి’.. రోహిత్, కోహ్లీ, రాహుల్‌పై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..

టీ20 ఫార్మాట్‌కు అవసరమైన ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా కీలకమైన ఓపెనర్లు కూడా అందుబాటులో ఉన్నారు. సీనియర్ ప్లేయర్లు రాహుల్, రోహిత్‌, కేఎల్ రాహుల్ లాంటి వారు పద్ధతి మార్చుకోకపోతే, వారిని భర్తీ చేసే ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి..

Team India: పేరుంటే సరిపోదు.. ఆ స్థాయి ప్రదర్శన కూడా ఉండాలి.. రోహిత్, కోహ్లీ, రాహుల్‌పై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..
Kapil Dev

Updated on: Jun 06, 2022 | 11:08 AM

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లతో కూడిన భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పొట్టి ఫార్మాట్‌లో తమ విధానాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భారత మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సూచించాడు. టీ20 ప్రపంచ కప్ ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో జరుగనున్న సంగతి తెలసిందే. మెన్ ఇన్ బ్లూ ఈ ట్రోఫీని కైవసం చేసుకోవాలంటే, టాస్ ఆర్డర్ వైఫల్యాలపై మరింత ఫోకస్ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన కపిల్ దేవ్ మరెన్నో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రోహిత్, కోహ్లిలు మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని, వీరికి ఎంతో పేరుంది, అలాగే వారిపై భారీ ఒత్తిడి ఉంటుంది. కానీ, వారిపై ఒత్తిడి అలా ఉండకూడదు. నిర్భయంగా వారు క్రికెట్ ఆడాలి. వీరంతా 150-160 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించే ఆటగాళ్లు ఇలా చేయడం, టీమిండియాకు శుభ పరిణామం కాదు’ అంటూ చురకలు అంటించారు.

” పరుగులు చేయాల్సిన సమయంలో.. వీరంతా పెవిలియన్ చేరుతున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడడంలో వైఫల్యం చెందుతున్నారు. దీంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు. వారంతా ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలి. భారీ స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై దాడి చేసి, ప్రత్యర్ధలపై పైచేయి సాధించాలి”అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.

అది లేకుంటే ఆటగాళ్లను మార్చండి – కపిల్ దేవ్

ఇవి కూడా చదవండి

“టీ20 ఫార్మాట్‌కు అవసరమైన ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా కీలకమైన ఓపెనర్లు కూడా అందుబాటులో ఉన్నారు. సీనియర్ ప్లేయర్లు రాహుల్, రోహిత్‌, కేఎల్ రాహుల్ లాంటి వారు పద్ధతి మార్చుకోకపోతే, వారిని భర్తీ చేసే ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

“ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడితే, 20 ఓవర్లు ఆడమని జట్టు చెబితే.. 60 పరుగులతో నాటౌట్‌గా ఉండాలనే కండీషన్ పెట్టాలి. లేదంటే జట్టుకు న్యాయం చేయడం కష్టమవుతుంది. ఇప్పుడున్న విధానం కచ్చితంగా మారాలి, లేదంటే ఆటగాళ్లను మార్చాలి. ఒక సీనియర్ ఆటగాడు, ఎంతో ప్రభావాన్ని చూపిస్తాడని, అంతా భావిస్తుంటారు. పేరుంటే సరిపోదు, ప్రదర్శన కూడా అలా ఉండాలి” అంటూ తెలిపారు.