అక్కడున్నది హిట్‌మ్యాన్‌రా.. ఎవరూ ఊహించని జట్టులోకి రోహిత్.? ముంబైకి గుడ్‌బై.!
ఐపీఎల్ 2024 ప్రారంభం నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో జరగకూడదని విషయాలు ఎన్నో జరిగాయి. హార్దిక్ పాండ్యా తిరిగి ఎంఐలో చేరడం.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం.. జట్టులోని అంతర్గత గొడవలు.. ప్లేయర్లు రెండు విభాగాలుగా విడిపోవడం.. ఇలా ఒకటేమిటి..

ఐపీఎల్ 2024 ప్రారంభం నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో జరగకూడదని విషయాలు ఎన్నో జరిగాయి. హార్దిక్ పాండ్యా తిరిగి ఎంఐలో చేరడం.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం.. జట్టులోని అంతర్గత గొడవలు.. ప్లేయర్లు రెండు విభాగాలుగా విడిపోవడం.. ఇలా ఒకటేమిటి.. చెప్పుకుంటూ పోవాలే గానీ కధలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర చర్చ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఇటీవల లక్నో జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ చేసిన కామెంట్స్.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ఆ ఫ్రాంచైజీ తరపున ఆడతాడనే దానికి ఊతమిస్తున్నాయ్. ముంబై జట్టును విడిచిపెట్టి ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వెళ్లాలని రోహిత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అనూహ్యంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వచ్చే సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. అతడి కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దమవుతున్నట్టు టాక్. ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
ఓ ఇంటర్వ్యూలో లక్నో కోచ్ జస్టిన్ లాంగర్‌ను ”ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఆటగాడిని మీరు సొంతం చేసుకోగలరు’ అని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. రోహిత్ శర్మను కచ్చితంగా ముంబై నుంచి ట్రేడ్ చేసుకుంటామని.. నాకు తెలిసి ఈ డీల్ మీరే కుదుర్చగలరని నవ్వుతూ సమాధానమిచ్చాడు లాంగర్.
𝗢𝗳𝗳 𝘁𝗵𝗲 𝗺𝗮𝗿𝗸 🏁 pic.twitter.com/9Zo5heBN80
— Rohit Sharma (@ImRo45) April 7, 2024




