Rohit Sharma: ఏంటి హిట్ మ్యాన్.. పార్ట్-టైమ్ స్పిన్నర్ ని కూడా ఎదుర్కోలేవా? వీడియో వైరల్

|

Dec 23, 2024 | 7:19 PM

BGT 2024లో రోహిత్ శర్మ ఫామ్ పై ఆందోళనలు పెరిగాయి.సెప్టెంబరు నుండి టెస్ట్ క్రికెట్‌లో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 11.69 సగటుతో కేవలం 152 పరుగులు మాత్రమే సాధించగలిగారు. మెల్‌బోర్న్ నెట్స్‌లో దేవదత్ పడిక్కల్ బౌలింగ్‌కు ఇబ్బంది పడిన వీడియో వైరల్ అయ్యింది. రోహిత్ టెస్ట్ క్రికెట్‌లో తన కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Rohit Sharma: ఏంటి హిట్ మ్యాన్.. పార్ట్-టైమ్ స్పిన్నర్ ని కూడా ఎదుర్కోలేవా? వీడియో వైరల్
Rohit Sharma
Follow us on

BGT 2024 టోర్నమెంట్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు రెండు టెస్టు మ్యాచ్‌ల్లో కేవలం 19 పరుగులే చేసిన రోహిత్ శర్మ ఫామ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పార్ట్-టైమ్ స్పిన్నర్ దేవదత్ పడిక్కల్‌తో నెట్స్‌లో రోహిత్ శర్మ ఆడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది అభిమానులలో వివిధ అభిప్రాయాలను రేకెత్తించింది.

పెర్త్ టెస్టులో పేరెంటల్ లీవ్ కారణంగా దూరమైన రోహిత్, తిరిగి అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో 3, 6, 10 స్కోర్లతో నిరాశ కలిగించారు. సెప్టెంబరు నుండి టెస్ట్ క్రికెట్‌లో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 11.69 సగటుతో కేవలం 152 పరుగులు మాత్రమే సాధించగలిగారు. ఈ ఫామ్ కోల్పోవడం, నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు అతనిపై మరింత ఒత్తిడి తీసుకువచ్చింది.

నెట్స్‌లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో కలిసి బౌలింగ్ చేసిన దేవదత్ పడిక్కల్, రోహిత్ శర్మను తన బౌలింగ్‌తో కష్టాల్లో పడేశాడు. పడిక్కల్ బౌలింగ్ చేసిన ఒక బంతికి రోహిత్ బ్యాక్‌ఫుట్‌లో ఇరుక్కుపోయి LBW అవుట్‌ అయ్యాడు. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు విపరీతంగా ట్రోల్ల్స్ చేస్తున్నారు.

సమకాలీన పరిస్థితులు చూసి, అభిమానులలో కొందరు రోహిత్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. నెట్స్‌లో బౌలింగ్ ఎదుర్కొంటున్న రోహిత్, మెల్‌బోర్న్‌లో తన ఫామ్‌ను తిరిగి పొందుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.