Rohit Sharma: టీ20 క్రికెట్‌కు అందుకే రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన హిట్ మ్యాన్
తాజాగా టీ20లో రిటైర్మెంట్ ప్రకటించడంపై రోహిత్ శర్మ స్పందించాడు. తాను క్రికెట్ మైండ్ సెట్ పరంగా యువకుడినే అని చెప్పకొచ్చారు. కొంత వారికి అవకాశాలు ఇవ్వాలనే
ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్కంఠబరిత పోరులో దక్షిణాఫ్రికాపైన 7 పరుగులతో తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆ రోజు జరిగిన మ్యాచ్‌ను ఏ క్రికెట్ అభిమాన్ని తన జీవితంలో మార్చిపోలేడు. 140 మంది కోట్ల మంది భారతీయులు కలలుకన్న టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుకుంది. 2007లో మిస్టర్ కూల్ ధోని కెప్టెన్‌గా ఉన్నప్పడు కప్ కొడితే మళ్లీ 2024లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ విజయం సాధించిన వెంటనే ఇండియాలో మాములుగా సెలబ్రేషన్స్ జరగలేదు. ప్రతీ క్రికెట్ అభిమాన్ని బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నాడు. అంత సంతోషంగా ఉన్నా సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషిన్ విరాట్ కోహ్లీ ఓ బాంబ్ పేల్చారు.
టీ20లకు రిటైర్మెంట్‌ను ప్రకటించి రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ అందరికీ షాక్ ఇచ్చారు. కప్ గెలిచామని సంతోషపడ్డాలో లేక రోహిత్, విరాట్ రిటైర్మెంట్ ప్రకటించినందకు బాధపడాలో క్రికెట్ అభిమానులకు అర్థం కాలేదు. రోహిత్ శర్మ, విరాట్ లేని టీ20లను ఎలా ఊహించుకోవాలని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా టీ20లో రిటైర్మెంట్ ప్రకటించడంపై రోహిత్ శర్మ స్పందించాడు. తాను క్రికెట్ మైండ్ సెట్ పరంగా యువకుడినే అని చెప్పకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో వయస్సు మీద పడుతున్నందకే రిటైర్మెంట్ ప్రకటించారా అని యాంకర్ ప్రశ్నించిగా..17 సంవత్సరాలు టీ20లను ఆడానని.. ఇక చాలనిపిందని చెప్పారు. వరల్డ్ కప్ గెలిచిన దానికన్నా గొప్ప సమయం మళ్లీ దొరకదని భావించి వీడ్కోలు పలికినట్లు చెప్పారు.
ఆటలో ఎదురయ్యే ఛాలెంజెస్‌ను డీల్ చేయడంలో తాను ఇంకా యువకుడినే అని చెప్పారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో తనకు మూడు ఫార్మట్‌లో ఆడే సత్తా ఉన్నా రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెప్పారు. ప్రసుత్తం బంగ్లాదేశతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారత్ మొదటి మ్యాచ్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండోొ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవుతూ వస్తుంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా కప్ మాత్రం భారత్‌కే దక్కుతుంది. నెక్ట్స్ ఆస్టేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ టెస్ట్ ఉంది. ఈ మ్యాచ్‌లు ఆస్టేలియాలో జరగనున్నాయి.