Rohit Sharma: 36 ఏళ్ల చరిత్రను మార్చనున్న రోహిత్ రాంగ్ టర్న్.. కట్‌చేస్తే.. గంభీర్‌కి మైండ్ బ్లాక్.. అదేంటంటే?

|

Oct 18, 2024 | 9:46 AM

India vs New Zealand: నిర్ణయాలు కొన్నిసార్లు సరైనవి కావొచ్చు. మరికొన్నిసార్లు తప్పుగా తేలవచ్చు. బెంగుళూరులో రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం చరిత్రను మారుస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల 36 ఏళ్లుగా జరగనిది బెంగళూరులో జరగడం చూడొచ్చు. అదే జరిగితే, హెడ్ కోచ్ గంభీర్‌కి ఇది మరిచిపోలేని, మింగుడు పడని రోజుగా మారనుంది.

Rohit Sharma: 36 ఏళ్ల చరిత్రను మార్చనున్న రోహిత్ రాంగ్ టర్న్.. కట్‌చేస్తే.. గంభీర్‌కి మైండ్ బ్లాక్.. అదేంటంటే?
India Vs New Zealand 1st Test
Follow us on

Rohit Sharma: బెంగళూరు టెస్టులో తొలిరోజు వర్షం కారణంగా రద్దవ్వగా, రెండో రోజు ఆటలో టీమిండియా సొంతగడ్డపై అత్యల్ప స్కోరు 46 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ వేసిన ఒక్క తప్పటి అడుగు 36 ఏళ్ల చరిత్రను మార్చగలదా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే, దీనికి సంబంధించిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే, ప్రధాన కోచ్ గంభీర్‌కు ఇది మరపురాని, మింగుడు పడని టెస్ట్ మ్యాచ్‌గా నిరూపితమవుతుంది. ఇప్పుడు రోహిత్ శర్మ వేసిన స్టెప్ ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా? మరి, ఆ 36 ఏళ్ల చరిత్రతో దీనికి సంబంధం ఏమిటి? ఇప్పుడు చూద్దాం..

రోహిత్ శర్మ ఏ స్టెప్ తీసుకున్నాడు?

ఇక్కడ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వేసిన స్టెప్ ఏంటంటే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. భారత కెప్టెన్ ఆ నిర్ణయం ఫలితంగా భారత జట్టు 46 పరుగులకే కుప్పకూలింది. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత రోహిత్ శర్మ తన తప్పును అంగీకరించాడు. పిచ్‌ను అర్థం చేసుకోవడంలో తప్పు చేశానని చెప్పాడు. దీంతో టాస్ గెలిచి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు.

రోహిత్ ఎత్తుగడ 36 ఏళ్ల చరిత్రను తిరగరాస్తుందా?

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ నిర్ణయం టీమిండియాకు ఆత్మహత్యే అనడంలో సందేహం లేదు. గొడ్డలితో తన కాళ్లపై తానే నరుక్కున్నట్లుగా ఉంది. ఆయన తీసుకున్న అదే నిర్ణయం ఇప్పుడు 36 ఏళ్ల చరిత్రను తిరగరాస్తుందనే ఆశలు రేకెత్తించింది. ఇక్కడ 36 ఏళ్ల చరిత్ర అంటే భారత్‌లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌లు గెలవడం.

న్యూజిలాండ్ చివరిసారిగా 36 ఏళ్ల క్రితం అంటే 1988లో భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ మ్యాచ్ ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగింది. ఆ తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్‌నైనా గెలవాలని కివీస్ జట్టు తహతహలాడుతోంది. ఇప్పుడు బెంగుళూరు టెస్టులో గట్టి పట్టు సాధించిన తీరు చూస్తుంటే.. రోహిత్ శర్మ వేసిన స్టెప్పుల వల్ల 36 ఏళ్ల చరిత్రే మారిపోయేలా కనిపిస్తోంది. అంటే, న్యూజిలాండ్ గెలిచే అవకాశం ఉంది.

గౌతమ్ గంభీర్ ఈ టెస్ట్ మ్యాచ్‌ని మరచిపోలేడుగా..!

ఇప్పుడు సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయిన రికార్డు సృష్టించింది. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత భారత్‌లో న్యూజిలాండ్‌ టెస్టు మ్యాచ్‌ గెలిస్తే.. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కోచింగ్‌ సారథ్యంలో గతంలో ఎన్నడూ జరగనివి జరగనున్నాయి. సహజంగానే ఇదే జరిగితే గౌతమ్ గంభీర్ కోచ్ కెరీర్‌లో బెంగళూరు టెస్టు మరిచిపోలేనిదిగా మారుతుంది.

అయితే, టీమ్ ఇండియాకు ఇంకా ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఉంది. బెంగళూరు టెస్టులో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. ముఖ్యంగా, క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ టెస్టు మ్యాచ్‌ను కూడా టీమిండియా కాపాడే అవకాశం ఉంది. కానీ, తాజా సమీకరణంలో కనిపిస్తున్నదాని ప్రకారం, చరిత్రను మార్చే అవకాశం చాలా తక్కువగా ఉందనే తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..