మా చెత్త ఆటే కొంపముంచింది – రోహిత్ శర్మ

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో ఇండియా పోరాటం సెమీస్‌తోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ స్పందించాడు. ఆరంభంలోని తమ చెత్త ఆటే.. మమ్మల్ని వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించేలా చేసిందని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిపై రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘కీలక సమయంలో జట్టుగా విఫలమయ్యాం. 30 నిమిషాల మా చెత్త ఆట.. ప్రపంచకప్‌ […]

మా చెత్త ఆటే కొంపముంచింది - రోహిత్ శర్మ

Updated on: Jul 12, 2019 | 4:42 PM

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో ఇండియా పోరాటం సెమీస్‌తోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ స్పందించాడు. ఆరంభంలోని తమ చెత్త ఆటే.. మమ్మల్ని వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించేలా చేసిందని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిపై రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘కీలక సమయంలో జట్టుగా విఫలమయ్యాం. 30 నిమిషాల మా చెత్త ఆట.. ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలను దూరం చేసింది. ఈ ఫలితంతో నా గుండె భారమైంది. మీకు కూడా అలానే ఉంటుంది. కానీ దేశం బయట అభిమానుల మద్దతు వెలకట్టలేనిది. యూకేలో మేం ఎక్కడ ఆడినా అక్కడకు వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.’ అంటూ పేర్కొన్నాడు.

మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్ లో 5 సెంచరీలు, 1 అర్ధ సెంచరీతో మొత్తం 648 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.