AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. చివరి వన్డే ఆడేసిన రోహిత్-కోహ్లీ.. వీడ్కోలు ఎప్పుడంటే?

Team India Full Schedule: భారత జట్టు 2024 సంవత్సరాన్ని టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది. అయితే, ఈసారి భారత జట్టు చాలా తక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ ఈ ఫార్మాట్‌లో కనిపించరా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే, ఇప్పటికే తమ చివరి వన్డే మ్యాచ్ ఆడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Team India: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. చివరి వన్డే ఆడేసిన రోహిత్-కోహ్లీ.. వీడ్కోలు ఎప్పుడంటే?
Rohit Sharma Virat Kohli Odi Career
Venkata Chari
|

Updated on: Jan 01, 2024 | 6:59 PM

Share

Rohit Sharma and Virat Kohli: 2023లో వన్డే ప్రపంచకప్‌ను గెలవాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. నవంబర్ 19వ తేదీని క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. కానీ, ఇప్పుడు అది 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. 2024లో టీమిండియా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. అంటే గతేడాది భారత జట్టు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఫార్మాట్‌లో ఈ ఏడాది అది సాధ్యం కాదు.

టీమ్ ఇండియా 2024 సంవత్సరాన్ని టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది. ఇటువంటి పరిస్థితిలో, టీమిండియా ఏడాది పొడవునా గరిష్టంగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈసారి టీమిండియా దాదాపు 15 టెస్టులు ఆడనుంది. అయితే ODI గురించి మాట్లాడితే 3 ODI మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఇటువంటి పరిస్థితిలో, టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లలో ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌లో ఆడటం ఇదే చివరిసారి అవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.

2024లో జరగనున్న భారత జట్టు మూడు వన్డే మ్యాచ్‌లు జులై-ఆగస్టు నెలలో శ్రీలంకతో సొంత గడ్డపైనే జరగనున్నాయి. ఇది కాకుండా, భారత జట్టు ఏడాది పొడవునా టెస్ట్, T-20 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఈ ఏడాది T-20 ప్రపంచకప్ జరగనుందని, అందుకే భారత జట్టు ఈ ఫార్మాట్‌పై దృష్టి సారిస్తుంది.

రోహిత్-కోహ్లి చివరి వన్డే ఇప్పటికే ఆడేశారా?

గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా వన్డే క్రికెట్‌ను శాసించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతకుముందు కూడా చాలా తక్కువ వన్డే సిరీస్‌లు ఆడేవారు. గత ఏడాది ప్రపంచకప్ ఉన్నందున, ఈ ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌లో ఆడటం కనిపించింది. అయితే ఈ ఏడాది కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఉన్నందున, ఆటగాళ్లిద్దరూ ఈ ఏడాది చివరిసారిగా ఇదే ఫార్మాట్‌లో ఆడి ఒక విధంగా వీడ్కోలు పలికే సూచనలు కనిపిస్తున్నాయి.

రోహిత్ శర్మ వయస్సు 36 కాగా, విరాట్ కోహ్లీ వయస్సు 35 సంవత్సరాలు. వారిద్దరి దృష్టి ఈ సంవత్సరం T-20 ప్రపంచ కప్, మిగిలిన 15 టెస్ట్ మ్యాచ్‌లపైనే ఉంది. ఇటువంటి పరిస్థితిలో, 3-మ్యాచ్‌ల ODI ఫార్మాట్‌పై దృష్టి సారించాల్సిన అవసరం లేదు. టీమ్ ఇండియా తన లెజెండ్‌లకు వీడ్కోలు పలకవలసి ఉంటుంది.

2024లో టీమ్ ఇండియా షెడ్యూల్..

వన్డేలు – 3

టెస్టులు – 15

టీ20లు – 9 మ్యాచ్‌లు + ప్రపంచ కప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..