ఫెదరర్ టెన్నిస్ ఆట నుంచి గురువారం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆటను ఇష్టపడే సచిన్.. ఫెదరర్ కోసం ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నాడు. ‘మీ టెన్నిస్ ఆడే శైలి మాకు నచ్చింది. మీరు టెన్నిస్ ఆడుతుంటే చూడటం అలవాటు చేసుకున్నాం. ఆ అలవాటు ఎప్పటికీ పోదు. మాలో ఓ భాగం అయింది. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను అందించినందుకు ధన్యవాదాలు’ అంటూ మాస్టర్ బ్లాస్టర్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే, టీమిండియా దిగ్గజం నుంచి ఫెదరర్ క్రికెట్ ఆటలోని కొన్ని మెళుకువలు నేర్చుకున్నాడంట. వాటిని తన ఆటలో భాగం కూడా చేసుకున్నాడు. ఈ విషయం నాలుగేళ్ల క్రితం జరిగింది. రోజర్ ఫెదరర్ 2018 వింబుల్డన్ ఆడుతున్న సమయంలో జరిగింది. సాధారణంగా క్రికెట్‌లో మాత్రమే కనిపించే షాట్ టెన్నిస్ లో ఆడాడు. ఫెదరర్ కొట్టిన ఈ షాట్ ఫార్వర్డ్ డిఫెన్స్ షాట్ లాంటిది. అతని ఈ షాట్ చూసిన తర్వాత, సచిన్ టెండూల్కర్ అతనిని ట్యాగ్ చేస్తూ ఒక ఫన్నీ విషయం రాసుకొచ్చాడు. దానికి ఫెదరర్ సమాధానం కూడా అంతే ఫన్నీగా ఆన్సర్ చేశాడు.
Ratings for @rogerfederer‘s forward defence, @ICC?#Wimbledon pic.twitter.com/VVAt2wHPa4
ఇవి కూడా చదవండి— Wimbledon (@Wimbledon) July 9, 2018
‘నువ్వు తొమ్మిదో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, క్రికెట్, టెన్నిస్ నోట్స్‌ని ఒకరికొకరు పంచుకుందాం’ అని సచిన్ రాసుకొచ్చాడు. అతనికి ఫెదరర్ బదులిస్తూ, ‘మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? నేను నోట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత సచిన్ సమాధానమిస్తూ, ఓకే అయితే మొదటి అధ్యాయం స్ట్రెయిట్ డ్రైవ్‌గా ఉంటుందని ఫన్నీగా చెప్పుకొచ్చాడు.
What a career, @rogerfederer. We fell in love with your brand of tennis. Slowly, your tennis became a habit. And habits never retire, they become a part of us.
Thank you for all the wonderful memories. pic.twitter.com/FFEFWGLxKR
— Sachin Tendulkar (@sachin_rt) September 15, 2022
మూడుసార్లు భారత్ వచ్చిన ఫెదరర్..
రోజర్ ఫెదరర్ ఇప్పటివరకు మూడుసార్లు భారత్‌కు వచ్చారు. అతను మొదటిసారిగా 2006 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. ఆ తర్వాత అతను 2014, 2015లో జరిగిన ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడానికి భారతదేశానికి వచ్చాడు. 2014 పర్యటనలో, అతను భారతదేశం వచ్చిన సందర్భంగా ఒక ట్వీట్ చేశాడు. ‘నేను ఇక్కడ గడిపిన అద్భుతమైన క్షణాలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు, భారతదేశం. ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను’ అంటూ ట్వీట్ చేశాడు. భవిష్యత్తులో సుదీర్ఘ పర్యటన కోసం భారత్‌కు వస్తానని కూడా చెప్పుకొచ్చాడు.