Rishabh Pant: నీ కెరీర్ బతకాలంటే వెంటనే ఆ పని చేయ్.. పంత్ కు మాజీ దిగ్గజం ఉచిత సలహా

Rishabh Pant: టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కెరీర్‌పై వసీమ్ జాఫర్ కీలక సూచనలు చేశాడు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాధ్యతలను వదిలి కేవలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. కేఎల్ రాహుల్‌ను ఉదాహరణగా చెబుతూ, పరుగులపై ఫోకస్ చేస్తే పంత్‌కు వన్డే, టీ20 జట్టులో తిరిగి చోటు దక్కే అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నాడు.

Rishabh Pant: నీ కెరీర్ బతకాలంటే వెంటనే ఆ పని చేయ్.. పంత్ కు మాజీ దిగ్గజం ఉచిత సలహా
Rishabh Pant (2)

Updated on: Aug 22, 2026 | 9:25 AM

Rishabh Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రికెట్ కెరీర్ ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థానం కోల్పోయిన పంత్, తన కెరీర్ను కాపాడుకోవాలంటే ఐపీఎల్‌లో కెప్టెన్సీని త్యాగం చేయాలని భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ సలహా ఇచ్చారు. భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ వేళ వసీమ్ జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌ వేదికగా రిషభ్ పంత్‌కు ఈ సూచనలు చేశారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కప్టెన్సీ ఆఫర్ చేసినా, దాన్ని పంత్ సున్నితంగా తిరస్కరించడమే మంచిదని జాఫర్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ వల్ల వచ్చే విపరీతమైన మానసిక ఒత్తిడి పంత్ సహజసిద్ధమైన బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందని, అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని కేవలం ఒక బ్యాటర్‌గా మాత్రమే మైదానంలోకి దిగాలని సూచించారు.

కేఎల్ రాహుల్‌ను చూసి నేర్చుకో

తన వాదనకు బలాన్ని చేకూరుస్తూ కేఎల్ రాహుల్ ఉదాహరణను జాఫర్ ప్రస్తావించారు. కెప్టెన్సీ భార భారాన్ని దింపుకున్న తర్వాతే కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో ఎంతో స్వేచ్ఛగా, అద్భుతంగా బ్యాటింగ్ చేయగలిగాడని గుర్తుచేశారు. గత రెండు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు అత్యధిక ధర పొందిన ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించిన పంత్, కెప్టెన్‌గా ఏమాత్రం రాణించలేకపోయారు. అటు లక్నో జట్టు ఘోరంగా విఫలం కావడం, ఇటు పంత్ తన బ్యాటింగ్ ఫామ్ దెబ్బతినడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారడంతో అక్కడ కూడా కప్టెన్సీ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జాఫర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూాడా చదవండి: ENG vs PAK: 2001 లార్డ్స్ సీన్ రిపీట్.. 25 ఏళ్ల తర్వాత పాక్ పై ఇంగ్లాండ్ ఆల్ టైమ్ రికార్డు

టీమిండియాలోకి రీఎంట్రీనే లక్ష్యం

ప్రస్తుతం టెస్టుల్లో నంబర్-1 వికెట్ కీపర్‌గా ఉన్నప్పటికీ పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20) నుంచి దాదాపు దూరమయ్యారు. రాబోయే ఐపీఎల్ సీజన్‌ను ఒక ఆయుధంగా మలచుకుని మళ్లీ తన మునుపటి మెరుపు బ్యాటింగ్‌ను ప్రపంచానికి చాటాలని జాఫర్ చెప్పారు. భారత జట్టులో కెప్టెన్సీ రేసు నుంచి పంత్ ఇప్పటికే వెనుకబడినందున, లీగ్ మ్యాచ్‌ల్లో కేవలం పరుగుల వేటపైనే శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తేనే జాతీయ జట్టులోని వన్డే, టీ20 ఫార్మాట్లలో పంత్‌కు తిరుగులేని రీఎంట్రీ సాధ్యమవుతుందని జాఫర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు

ఇది కూడా చదవండి: Mitchell Starc: వీడు మగాడ్రా బుజ్జి.. 42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us