AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సర్కస్ ఫీట్లు.. అదిరిందన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ..

Rishabh Pant Flip: టీమిండియా యువ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్ మైదానంలోకి వచ్చినప్పుడల్లా వార్తల్లో ఉంటాడు. అహ్మదాబాద్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో

ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సర్కస్ ఫీట్లు.. అదిరిందన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ..
రిషబ్ పంత్
Sanjay Kasula
|

Updated on: Mar 05, 2021 | 12:56 PM

Share

India vs England: టీమిండియా యువ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్ మైదానంలోకి వచ్చినప్పుడల్లా వార్తల్లో ఉంటాడు. అహ్మదాబాద్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ సందర్భంగా అదే జరిగింది.  ఈ టెస్ట్ మొదటి రోజు, పంత్ వికెట్ వెనుక చాలా చురుకుగా కనిపించాడు. తనదైన శైలిలో, అతను బౌలర్లను ప్రోత్సహించాడు. ఇంతలో ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ బంతిని క్యాచ్ చేసే ప్రయత్నంలో పడిపోయాడు.

ఇషాంత్ బౌలింగ్ వేస్తున్న సమయంలో బ్యాట్స్ మాన్‌కి చాలా దగ్గరగా వేశాడు. కాని పంత్ మాత్రం ఆ బంతిని చాలా కష్టపడి పైకి ఎగిరి అందుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో బంతిని పట్టుకోవటానికి పంత్ చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు బంతిని పట్టుకునేటప్పుడు పంత్ పడిపోవల్సి వచ్చింది. కానీ కింద పడిపోయిన తరువాత, అతను యథావిధిగా నిలబడలేదు… దూకి జిమ్నాస్ట్ లాగా పల్టీలు కొట్టాడు. ఇక్కడ పంత్ ఫిట్నెస్ కనిపించింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రిషబ్ దూకి నిలబడటం చూసి ఆశ్చర్యపోయాడు. అతను చేతి సంజ్ఞలు చేస్తూ.. కళ్ళతో పంత్ ప్రశంసిస్తూ కనిపించాడు. అదే సమయంలో వికెట్ కీపర్ పంత్ కూడా విరాట్ వైపు చూసి నవ్వాడు. ఈ సంఘటన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ యొక్క ఏడవ ఓవర్‌లో జరిగింది. కామెంట్రీ బాక్స్‌లో కూర్చున్న మాజీ ఫాస్ట్ బౌలర్లు అజిత్ అగర్కర్, డీప్ దాస్‌గుప్తా కూడా జింనాస్ట్ లాగా పంత్ నిలబడటం చూసి నవ్వడం మొదలు పెట్టారు.

ఇదే అంశంపై డీప్ దాస్‌గుప్తా సెటైర్లు సందించాడు. “గుడ్ వన్ రిషబ్”, అజిత్ అగర్కర్, “డీప్ దాస్‌గుప్తా తన కాలంలో కూడా అదే చేసేవాడు అంటూ కామెంట్ చేశాడు. ఇంతలో, రిషబ్ పంత్ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో స్టంప్ వికెట్ కూడా తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

4 బంతుల్లో.. 4 వికెట్లు 2 సార్లు తీసిన ప్రపంచంలోనే ఏకైక బౌలర్, ఈ రికార్డు దగ్గరికి కూడా ఎవరూ రాలేరు ..

ఖతార్‌లో సానియా మీర్జా జోడీకి చుక్కెదురు.. టాప్​-200లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!