అటు సెహ్వాగ్, ఇటు ధోని.. ఒకే దెబ్బకు 3 రికార్డులు బ్రేక్ చేసిన పంత్.. సెల్యూట్ చేయాల్సిందే భయ్యో..

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో, పంత్ బ్యాటింగ్‌కు దిగి తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో ఒక భారీ సిక్సర్‌ను బాది, టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ సిక్సర్ అతని టెస్ట్ కెరీర్‌లో 90వ సిక్సర్ కావడం విశేషం.

అటు సెహ్వాగ్, ఇటు ధోని.. ఒకే దెబ్బకు 3 రికార్డులు బ్రేక్ చేసిన పంత్.. సెల్యూట్ చేయాల్సిందే భయ్యో..
Rishabh Pant Records

Updated on: Jul 24, 2025 | 7:27 PM

భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు బాదడం ద్వారా పంత్ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటివరకు 90 సిక్సర్లతో వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి, పంత్ 90 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో, పంత్ బ్యాటింగ్‌కు దిగి తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో ఒక భారీ సిక్సర్‌ను బాది, టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ సిక్సర్ అతని టెస్ట్ కెరీర్‌లో 90వ సిక్సర్ కావడం విశేషం.

రిషబ్ పంత్ కేవలం 47 టెస్టు మ్యాచ్‌లలోనే ఈ అద్భుతమైన రికార్డును సాధించడం అతని దూకుడు స్వభావానికి నిదర్శనం. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్టు మ్యాచ్‌లలో 90 సిక్సర్లు బాది ఈ రికార్డును నెలకొల్పాడు. పంత్ కేవలం 47 మ్యాచ్‌లలోనే ఈ రికార్డును సమం చేయడం అతని విధ్వంసకర బ్యాటింగ్‌కు అద్దం పడుతుంది. ఈ జాబితాలో రోహిత్ శర్మ (88 సిక్సర్లు) మూడో స్థానంలో, ఎంఎస్ ధోని (78 సిక్సర్లు) నాలుగో స్థానంలో, రవీంద్ర జడేజా (74 సిక్సర్లు) ఐదో స్థానంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సిరీస్‌లో పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇప్పటికే ఈ సిరీస్‌లో 466 పరుగులు చేసి, సగటు 77.67గా ఉంది. తన కెరీర్ ఆరంభం నుంచీ టెస్టు క్రికెట్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా తనదైన ముద్ర వేసుకున్న పంత్, ముఖ్యంగా విదేశీ గడ్డపై కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలు అందించాడు.

అయితే, దురదృష్టవశాత్తు, ఈ మ్యాచ్‌లో పంత్ కాలికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ 75 బంతుల్లో 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

ఒక టెస్ట్ సిరీస్‌లో ఒక భారత కీపర్ చేసిన అత్యధిక స్కోర్లు..

5 – రిషబ్ పంత్ vs ENG, 2025*

4 – ఫరూఖ్ ఇంజనీర్ vs ENG, 1972/73

4 – ధోని vs AUS, 2008/09

4 – MS ధోని vs ENG, 2014

భారతదేశం తరపున టెస్ట్‌లలో అత్యధిక సిక్సర్లు..

90* – రిషబ్ పంత్

90 – వీరేంద్ర సెహ్వాగ్

88 – రోహిత్ శర్మ

78 – ఎంఎస్ ధోని

74 – రవీంద్ర జడేజా

ఇంగ్లాండ్‌లో ఒక కీపర్ చేసిన అత్యధిక టెస్ట్ పరుగులు..

479* – రిషబ్ పంత్ vs ENG, 2025

464 – అలెక్ స్టీవర్ట్ vs SA, 1998

415* – జేమీ స్మిత్ vs IND, 2025

387 – జానీ బెయిర్‌స్టో vs SL, 2016.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..