ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఓడిపోయిన భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పుడు టీ20 సిరీస్‌లో ప్రత్యక్షంగా తలపడనున్నాయి. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం (నవంబర్ 18) వెల్లింగ్టన్‌లో జరగనుంది. రోహిత్, విరాట్, రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించడంతో ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది టీమిండియా. కాగా దిగ్గజ బ్యాటర్లు లేని పక్షంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్న. ముఖ్యంగా రోహిత్, రాహుల్ లేకపోవడంతో ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు కెప్టెన్ పాండ్యా, కోచ్ లక్ష్మణ్ కానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఉన్నందున అతడినే ఓపెనర్‌గా బరిలోకి దింపుతారని తెలుస్తోంది. గతంలో ఇంగ్లండ్ పర్యటనలో ఓపెనర్‌గా పంత్‌కు అవకాశం వచ్చింది. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడీ లెఫ్ట్ హ్యాండర్. అయితే అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీనికి తోడు కెరీర్ తొలినాళ్లలో రిషబ్ ఓపెనర్‌గా ఆడాడు. అందువలన పంత్‌నే ఓపెనర్‌గా బరిలోకి దిగతాడని సమాచారం. దూకుడుగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న పంత్ పవర్‌ప్లేలో భారీగా పరుగులు సాధిస్తాడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
మరో ఎడమచేతి వాటం బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఓపెనింగ్ రేసులో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కూడా కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2024లో ఓపెనింగ్ స్థానానికి ఇషాన్ కిషన్ ప్రధాన పోటీదారుడిగా మారిపోయాడు. అలాగే టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఓపెనర్‌గా సంజూ శాంసన్ కూడా పోటీలో ఉన్నాడు. ప్రస్తుతం అతను మిడిల్ ఆర్డర్‌లో రాణించి, టీమ్ ఇండియా తదుపరి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ టీ20 ఫార్మాట్‌లో, శాంసన్‌ను ఓపెనర్‌గా దిగే అన్ని అర్హతలు శాంసన్‌కు ఉన్నాయి. దీపక్ హుడా కూడా ఓపెనింగ్‌కు పోటీదారు. ఐర్లాండ్ టీ20 సిరీస్ లో హుడ్ టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. అటువంటి పరిస్థితిలో, హుడా ప్రారంభ స్థానానికి మంచి ఎంపిక. అతడితో పాటు శుభ్‌మన్ గిల్ కూడా ఓపెనింగ్‌కు పోటీదారు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు ఐపీఎల్‌లో ఓపెనర్‌గా వచ్చిన అనుభవం ఉంది. ఇవే కాకుండా వన్డే, టెస్టు ఫార్మాట్లలో కూడా గిల్‌కు మంచి ఓపెనింగ్ అనుభవం ఉంది.
How’s that for a Trophy unveil! ? ?#TeamIndia | #NZvIND
? Courtesy: @PhotosportNZ pic.twitter.com/qTazPXpr3R
— BCCI (@BCCI) November 16, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..