IPL 2023: ఈ ఆటగాళ్ల మాకొద్దంటూ నిర్మోహమాటంగా వదిలేసుకున్న ఫ్రాంచైజీలు.. ఆ ప్లేయర్లు ఎవరంటే?
దంచేస్తారు.. పొడిచేస్తారు.. ఇరగదీస్తారని క్రికెట్ ప్లేయర్లను ఎగబడి ఎగబడి కొన్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. కానీ వాళ్ల లెక్కలు తప్పాయి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో టైటిల్‌కి చాలా దూరంలో బొక్కబొర్లా పడ్డాయి. అందుకే ప్రక్షాళన చేపట్టాయి. ఈ ఆటగాళ్ల మాకొద్దంటూ నిర్మోహమాటంగా వదిలేసుకున్నాయి. మరి ఆ ప్లేయర్లు ఎవరు?

ఆటగాళ్లను కొనేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. కోట్లు కుమ్మరించి దక్కించుకున్నాయి. ఈ ఏడాది రెండు టీమ్‌లు కొత్తగా ఎంట్రీ ఇవ్వడంతో వేలంపాట మరో రేంజ్‌కి వెళ్లిపోయింది. తాము తీసుకున్న ఆటగాళ్లు పోటుగాళ్లని భావించాయి. తీరా ఆటకొచ్చేసరికి.. ఖరీదైన ఆటగాళ్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. పెట్టిన పెట్టుబడికి.. వాళ్లిచ్చిన పెర్ఫామెన్స్‌కి సంబంధమే లేకుండాపోయింది. అందుకే వాళ్లందరికి దిమ్మతిరిగే షాకిచ్చాయి ఫ్రాంఛైజీలు. మీరు మాకొద్దంటూ దండం పెట్టేశాయి. ఐపీఎల్ 2023లో రీటెయిన్ అండ్ రిలీజ్ చేసే ప్లేయర్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. నవంబర్ 15తో గడువు ముగియటంతో ఫ్రాంచైజీలన్నీ తాము అట్టి పెట్టుకున్న.. విడుదల చేసిన ప్లేయర్ల లిస్టును బీసీసీఐకి అందజేశాయి. కొన్ని ఫ్రాంచైజీలు అగ్రశ్రేణి ఆటగాళ్లను వదిలేశాయి. మరికొన్ని ఎక్కువ మందిని రిలీజ్ చేసి తమ పర్స్ వాల్యూ పెంచుకున్నాయి.
బ్యాటింగ్ కోచ్‌గా కీరన్ పోలార్డ్
ముంబై ఇండియన్స్.. వేలానికి ముందు అత్యధిక మంది ప్లేయర్లను వదిలేసిన ఫ్రాంచైజీ ఇదే. పొలార్డ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టైమల్ మిల్స్‌ను రిలీజ్ చేసింది. వీరిలో పోలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా అపాయింట్ చేసుకోగా.. మిగిలిన వాళ్లందరికి టాటా చెప్పింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే ఏకంగా కెప్టెన్ కేన్ మామనే వద్దనుకుంది. నికోలస్ పూరన్, సుచిత్, ప్రియమ్ గార్గ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, గోపాల్, సుశాంత్ మిశ్రాలను వదిలేసుకుంది. ఎక్కువమంది స్టార్ ఆటగాళ్లను తప్పించింది ఎస్‌ఆర్‌హెచే. మేనేజ్‌మెంట్ నిర్ణయంతో విదేశీ ప్లేయర్లు ఫుల్ డిసప్పాయింట్ అయ్యారని తెలుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ కూడా కీలక ప్లేయర్లను రిలీజ్ చేసింది. డ్వేన్ బ్రేవో, ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్‌లను సాగనంపింది. ఇక ఢిల్లీ కేపిటల్స్ శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్‌లను వేలానికి వదిలేసింది. మరోవైపు రాజస్తాన్ రాయల్స్.. అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ స్టార్లను నిర్దాక్షిణ్యంగా కాదనుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా కీలక ఆటగాళ్లను రిలీజ్ చేసింది. పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానేలకు అవమానకర ఉద్వాసన తప్పలేదు. పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్‌లకు టాటా చెప్పింది. వీరిలో మయాంక్ కెప్టెన్ అయినా కనీకరించలేదు.
జేసన్, అనీశ్వర్, మిలింద్, సిసోడియా రూథర్‌ఫోర్డ్‌లకు ఉద్వాసన పలికింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అటు లక్నో సూపర్ జెయింట్స్ ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్‌లను నిర్ధాక్షిణ్యంగా రిలీజ్ చేసింది.
అవమానకర రీతిలో వదిలించుకున్న టీమ్స్
ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో కొందరిని అవమానకర రితీలో వదిలించుకున్నట్లు స్పష్టమవుతోంది. రిలీజ్ చేసిన ఆటగాళ్ల గత రికార్డులు, ఈ సీజన్‌లో పెర్ఫామెన్స్, ఫామ్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ముందస్తు నోటీసులు లేకుండా తమను జట్టు నుంచి పంపించారని కొంతమంది ప్లేయర్లు అవేదన వ్యక్తం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




