
IND vs UAE Playing 11: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత, ఆటగాళ్ల ఎంపిక, ప్లేయింగ్ XI కూర్పుపై చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో, మాజీ భారత ఆటగాడు, క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఎంపికైనప్పటికీ, యువ ఫినిషర్ రింకూ సింగ్ ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకోవడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ స్థానంలో మరో ఆల్-రౌండర్ ఆడే అవకాశం ఉందని సూచించాడు.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో రింకూ సింగ్ చోటు దక్కించుకున్నప్పటికీ, ఇటీవల కాలంలో అతడి ఫామ్ అంతగా బాగాలేదు. 2024, 2025 ఐపీఎల్ సీజన్లలో రింకూ ఆశించినంతగా రాణించలేకపోయాడు. బ్యాటింగ్ స్థానంలో మార్పులు, తక్కువ ఓవర్లలో బ్యాటింగ్ చేయడం అతడి ప్రదర్శనపై ప్రభావం చూపించాయి. దీనితో పాటు, రింకూ ఒక ఫినిషర్‌గా మాత్రమే పరిమితం కావడం, బౌలింగ్ చేయకపోవడం కూడా అతడికి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని చోప్రా విశ్లేషించాడు.
రింకూ సింగ్ స్థానంలో శివమ్ దూబేకు అవకాశం ఇవ్వాలని ఆకాష్ చోప్రా సూచించాడు. శివమ్ దూబే ఆసియా కప్‌లో ఏడో స్థానంలో ఆడేందుకు అర్హుడని పేర్కొన్నాడు. దూబే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలడని, ఇది జట్టుకు ఒక అదనపు ఆప్షన్‌గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం వల్ల రింకూకు చోటు దొరకడం కష్టమని ఆయన చెప్పాడు.
ఆకాష్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలతో పాటు, ఆసియా కప్ భారత జట్టులో ఇతర ఆటగాళ్ల ఎంపికపై కూడా పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓపెనింగ్ స్థానం కోసం శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ మధ్య పోటీ, వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేష్ శర్మ మధ్య పోటీ వంటి అంశాలపై చర్చ జరుగుతోంది.
సెలక్టర్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నప్పటికీ, ప్లేయింగ్ XIలో ఎవరికి చోటు దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా, స్టార్ ఫినిషర్‌గా పేరుగాంచిన రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..