WTC Final 2023: ఐపీఎల్ 16వ సీజన్ చివరి రోజుకు రావడంతో అందరి దృష్టిం ఇప్పుడు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ మీద కూడా పడింది. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత భారత జట్టు డబ్య్లూటీసీ ఫైనల్ ఆడబోతుంది. లండన్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరిగి ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో పలువురు మాజీలు ఇరు జట్ల నుంచి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నారు. ఇటీవలే టీమిండియా మాజీ ప్లేయర్ రవిశాస్త్రీ ప్రకటించగా.. ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. పాంటింగ్ ఎంచుకున్న ప్లేయింగ్ ఎలెవన్‌లో డేవిడ్ వార్నర్, రవిచంద్రన్ అశ్విన్‌కి స్థానం కల్పించకపోవడం గమనార్హం.
రికీ పాంటింగ్ ఎంచుకున్న టీమ్‌లో రోహిత్ శర్మ, ఉస్మాన్ ఖవాజా ఓపెన్లుగా ఉణ్నారు. ఇంకా వన్‌డౌన్‌లో మార్నస్ లాబుషేన్, ఆ తర్వాత విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు పాంటింగ్. అనంతరం 5వ, 6వ స్థానాల్లో స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఆపై వికెట్ కీపర్‌గా అలెక్స్ కారీ ఉన్నాడు. ఇంకా బౌలర్ల విభాగంలో పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, మహ్మద్ షమీ ఉన్నారు. అలాగే పాంటింగ్ తన టీమ్‌కి హిట్ మ్యాన్ రోహిత్ శర్మకే సారథ్య బాధ్యతలు అప్పగించాడు.
What do you make of Ricky Ponting’s predicted Australia XI for the #WTC23 Final?
More ➡️ https://t.co/L6hH5Q58sx pic.twitter.com/bCyVDS1Xn7
— ICC (@ICC) May 26, 2023
What do you make of Ravi Shastri’s predicted India XI for the #WTC23 Final?
More ? https://t.co/z8Nha1O8Kc pic.twitter.com/vLGpyAMow3
— ICC (@ICC) May 24, 2023
Ricky Ponting’s WTC Final XI: రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, మహ్మద్ షమీ
Ravi Shastri’s s Team India for WTC Final: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..