మరికొద్ది రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. అయితే ఈలోపు ఐపీఎల్ ఫ్యాన్స్‌కు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ అందించింది. 4K క్వాలిటీతో లైవ్‌లో క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు 6 కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు ఈ ప్లాన్స్ మరింత సౌకర్యంగా మారనున్నాయి. వీటిల్లో మూడు ప్లాన్స్‌కు కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు డేటా ప్రయోజనం కూడా వస్తోంది. ఇక మిగిలిన మూడు డేటా యాడ్-ఆన్ వోచర్స్ మాత్రమే. మరి ఆ ప్లాన్స్ ఏంటో ఓసారి తెలుసుకుందామా..?
అపరిమిత వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లతో పాటు డైలీ 3జీబీ హై-స్పీడ్ డేటా ఉచితం. వీటితో పాటు మరో రూ. 241 డేటా యాడ్ ఆన్ వోచర్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.
రోజూ 3జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు మరో రూ.61 విలువైన వోచర్ ఈ ప్లాన్‌తో ఉచితంగా వస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు.
3జీబీ డేటా డైలీ, అపరిమిత కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు మరో రూ. 25 విలువైన వోచర్ ఈ ప్లాన్‌తో ఉచితంగా వస్తుంది. దీని వ్యాలిడిటీ 14 రోజులు.
ఈ డేటా యాడ్ ఆన్-వోచర్స్ బేసిక్ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌పై అదనపు డేటాను అందిస్తాయి.
రూ.222: 50జీబీ డేటా(వ్యాలిడిటీ- ప్రస్తుత ప్లాన్ ఎక్స్‌పైరీ గడువు)
రూ.444: 100 జీబీ డేటా(వ్యాలిడిటీ – 60 రోజులు)
రూ.667: 150 జీబీ డేటా(వ్యాలిడిటీ – 90 రోజులు)
కాగా, ఈ ప్లాన్స్ అన్ని కూడా మార్చి 24వ తేదీ నుంచి జియో యూజర్లకు అందుబాటులో ఉంటాయని సంస్థ పేర్కొంది.