
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోతే.. టీమిండియా పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తుందా.? అంటే.? అవునని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న వన్డే సిరీస్‌లో ఈ తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు. వాస్తవానికి విండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత విరాట్, రోహిత్ ఇద్దరూ.. స్వదేశానికి తిరిగి వస్తారని అందరూ భావించారు. అయితే.. అనూహ్యంగా సెలెక్టర్లు ఈ స్టార్ ప్లేయర్స్‌ను వన్డేలకు ఎంపిక చేశారు.
మొదటి వన్డేలో యంగ్ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చింది టీమ్ మేనేజ్‌మెంట్.. ఇక ఈ ప్రయోగం కాస్తా వికటించింది. ఇషాన్ కిషన్ మినహా మిగిలిన వారంతా చేతులెత్తేశారు. ఇక ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ.. అప్పటికే ఉన్న కాసింత స్కోర్ అందించడంలో సహాయపడ్డాడు. కోహ్లి అయితే అస్సలు బ్యాటింగ్‌కే రాలేదు. ఇప్పటికైనా ముగుస్తుందా ఈ ప్రయోగం అనుకుంటే.. ఏకంగా రెండో వన్డేకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు విశ్రాంతినిచ్చి.. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కట్ చేస్తే.. మ్యాచ్ కాస్తా స్వాహా అయింది. ఈసారి కూడా ఇషాన్ కిషన్ మినహా మరెవ్వరూ ఆడలేదు. హార్దిక్ కూడా అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. మూడో వన్డేలో రోహిత్, కోహ్లీ ఆడతారని తెలుసున్నప్పటికీ.. ఇప్పుడు వీరిద్దరూ లేకపోతే టీమిండియా ఇక అంతే! అన్నట్టుగా ఉంది.
వన్డే ప్రపంచకప్ దగ్గరపడుతోంది.. దాదాపు ఇప్పుడున్న టీమ్ సభ్యులే అప్పుడు కూడా భాగం కానున్నారు. ఏ మెగా టోర్నమెంట్ ముందైనా.. ప్రాక్టిస్ కావలసినన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే జట్టులోని స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అలా కాదని వాళ్లకు రెస్ట్ ఇచ్చి.. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పజెప్పడం పెద్ద తప్పు. మిడిలార్డర్ పూర్తిగా పేలవమైన బ్యాటింగ్ ఉన్నట్టు స్పష్టమైంది.
So today the actual world cup team is playing as the young team will be going in the world cup.
Rohit and Virat will be dropped after the Asia cup. Not it down ✍️#CricketTwitter |#RohitSharma#ViratKohli pic.twitter.com/ONsClYHPny
— Nihar_45 (@NiharxHitman1) July 29, 2023
అటు బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ రెండో వన్డేలో పాండ్యా తప్పులు చేశాడు. ఓపెనర్లుగా గిల్, కిషన్ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్‌మెన్ క్రీజులో సరిగ్గా కుదురుకోలేకపోయారు. ఎప్పుడూ వచ్చే నాలుగో స్థానం కాకుండా.. ఆరో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగడం.. అతడి బ్యాటింగ్ లయను పూర్తిగా దెబ్బతీసింది. ఫినిషర్లైన శాంసన్, అక్షర్ పటేల్ 3,4 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగడం.. వారు విఫలం కావడం ఫ్యాన్స్‌ను ఆందోళన కలిగిస్తోంది. హార్దిక్ పాండ్యా అటు కెప్టెన్‌గా.. ఇటు ఆటగాడిగా విఫలమయ్యాడు.
ఇకనైనా వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి ముందుగా ఇలాంటి ప్రయోగాలు చేయకుండా.. పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగితే.. టీమిండియా ట్రోఫీ గెలుస్తుందని ఆశలు ఉంటాయని.. లేదంటే ఈసారికి కూడా నిరాశే మిగులుతుందని ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఆసియా కప్ తర్వాత రోహిత్, విరాట్‌లను తప్పిస్తారు.. ఇదే ప్రపంచకప్ టీమ్.. రాసిపెట్టుకోండి.. కప్ గోవిందా అని మరికొందరు కామెంట్ పెడుతున్నారు.
This clown bcci rested rohit and virat wtf is happening they won’t play wi t20i automatically there will be 1 month rest before Asia Cup
Never in my life prayed for India loss but today they should suffer 🙏🙏— Jod Insane (@jod_insane) July 29, 2023