IPL 2021: RCB అభిమానులకు గుడ్ న్యూస్.. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ డేనియల్‌ సామ్స్‌ బయో బబుల్‌ సమయం ముగిసింది. అతడికి కోవిడ్ పరీక్షలు చేసిన వైద్య అధికారులు అతడికి నెగెటివ్ అని తేల్చారు. ఐపీఎల్‌ 2021 వ సీజన్‌లో వరుస విజయాలతో...

IPL 2021: RCB అభిమానులకు గుడ్ న్యూస్.. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
Daniel Sams Test

Updated on: Apr 17, 2021 | 6:17 PM

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ డేనియల్‌ సామ్స్‌ బయో బబుల్‌ సమయం ముగిసింది. అతడికి కోవిడ్ పరీక్షలు చేసిన వైద్య అధికారులు అతడికి నెగెటివ్ అని తేల్చారు. ఐపీఎల్‌ 2021 వ సీజన్‌లో వరుస విజయాలతో దూకుడుమీదున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కు ఇది మరో గుడ్ న్యూస్ అని చెప్పాలి. కొవిడ్‌-19 నేపథ్యంలో రెండుసార్లు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల్లోనూ నెగెటివ్‌ రావడంతో అతను జట్టుతో చేరినట్లు ఫ్రాంచైజీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్‌ 7న సామ్స్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా అప్పటి నుంచి ఐసోలేషన్‌లో ఉన్నాడు.

ఈ సీజన్‌లో ట్రేడింగ్‌ ద్వారా సామ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి బెంగళూరు టీమ్ లోకి వచ్చాడు . ఆస్ట్రేలియా నుంచి ఏప్రిల్‌ 3న భారత్‌కు వచ్చినప్పుడు నిర్వహించిన టెస్టులో మొదట అతనికి నెగెటివ్‌ వచ్చింది.

ఏప్రిల్‌ 7న ఆల్‌రౌండర్‌కు పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ నిబంధనల ప్రకారం 10 రోజుల తప్పనిసరి ఐసోలేషన్‌ లో ఉన్న తర్వాత సామ్స్‌ జట్టులో చేరినట్లు ఫ్రాంఛైజీ తెలిపింది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు ఏప్రిల్‌ 18న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.

ఇవి కూడా చదవండి: PM Modi-Kumbh Mela: కుంభమేళాపై కీలక ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మరి సాధువులు వినేనా..?

Loading...
Unable to load recommendations.
Follow Us