13 ఇన్నింగ్స్‌లు.. 977 పరుగులు.. 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు.. కోహ్లీ స్నేహితుడి దూకుడు.. త్వరలో టీమిండియాలో చేరే ఛాన్స్..

IND A vs NZ A: ఐపీఎల్ 2022లో సందడి చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ న్యూజిలాండ్-ఎపై అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ అజేయంగా 109 పరుగులు చేశాడు.

13 ఇన్నింగ్స్‌లు.. 977 పరుగులు.. 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు.. కోహ్లీ స్నేహితుడి దూకుడు.. త్వరలో టీమిండియాలో చేరే ఛాన్స్..
Rajat Patidar, Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Sep 18, 2022 | 4:55 PM

Rajat Patidar: న్యూజిలాండ్ ఏ తో జరుగుతున్న 4 రోజుల సిరీస్‌లో భారత్‌కు చెందిన రజత్ పాటిదార్ తన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. పాటిదార్ బ్యాటింగ్ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఇటీవలి కాలంలో రజత్ చేసిన ప్రదర్శనతో టీమ్ ఇండియాలో చేరాలని అంతా భావిస్తున్నారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న 4 రోజుల మ్యాచ్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రజత్ 135 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. పాటిదార్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా భారత్ ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 359 పరుగులు చేయగలిగింది.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌లో, పాటిదార్ తన బ్యాటింగ్‌తో చెలరేగి 4 ఇన్నింగ్స్‌లలో 106.33 సగటుతో మొత్తం 319 పరుగులు చేయగలిగాడు. ప్రస్తుతం సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కివీస్‌తో జరిగిన అదే సిరీస్‌లో రజత్ తొలి మ్యాచ్‌లోనూ 256 బంతుల్లో 176 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తరపున ఆడుతున్న రజత్ పాటిదార్.. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 13 ఇన్నింగ్స్‌లలో 977 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

రజత్ పాటిదార్‌పై టీమిండియాకు కొత్త నమ్మకం వస్తుందా?

రజత్ పాటిదార్ ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 13 ఇన్నింగ్స్‌లు ఆడి 977 పరుగులు చేయగలిగాడు. ఈ సమయంలో అతని సగటు 88.81గా ఉంది. 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా రజత్ రానున్న కాలంలో భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించగలనని నిరూపించాడు. అదే విధంగా రజత్ తన ప్రదర్శనను నిలబెట్టుకోవడంలో సఫలమైతే.. అతడికి కూడా టీమిండియా జెర్సీని ధరించే అవకాశం వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. అయితే దీని కోసం అదే పనితీరును మరింతగా కొనసాగించాల్సి ఉంటుంది. తద్వారా అతను సెలెక్టర్ల దృష్టిలో పడతాడు. ఈ ప్రత్యేక ప్రదర్శనతో అతను ఖచ్చితంగా టీమ్ ఇండియా తలుపు తట్టడం ప్రారంభించే అవకాశం ఉంది.

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టులో భాగం..

రజత్ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టులో భాగంగా ఆడుతున్నాడు. 2022 ఐపీఎల్‌లో అతను 8 మ్యాచ్‌లలో 333 పరుగులు చేయడంలో విజయవంతమయ్యాడు. ఐపీఎల్‌లో ఆడిన 12 మ్యాచ్‌లలో ఓవరాల్‌గా 404 పరుగులు చేయగలిగాడు. అతని పేరిట 2 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్‌లో రజత్ సెంచరీ కూడా చేశాడు.