‘మా ఆయనే కాదు.. నేనూ సిక్స్‌లు కొట్టగలను’.. బ్యాట్‌ పట్టి బౌండరీల వర్షం కురిపించిన టీమిండియా క్రికెటర్‌ భార్య

|

Apr 26, 2023 | 3:46 PM

సాధారణంగా క్రికెటర్ల భార్యలు గ్యాలరీల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. గ్రౌండ్‌లో భర్త మ్యాచ్‌లు ఆడుతుంటే చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తుంటారు. ఇక స్టువర్ట్ బిన్నీ, బుమ్రా భార్యలైతే కామెంటేటర్లుగా మైదానంలో సందడి చేస్తుంటారు. అంతేకానీ బ్యాట్‌ పట్టి గ్రౌండ్‌లోకి దిగడం చాలా అరుదు.

మా ఆయనే కాదు.. నేనూ సిక్స్‌లు కొట్టగలను.. బ్యాట్‌ పట్టి బౌండరీల వర్షం కురిపించిన టీమిండియా క్రికెటర్‌ భార్య
Rivaba Jadeja
Follow us on

సాధారణంగా క్రికెటర్ల భార్యలు గ్యాలరీల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. గ్రౌండ్‌లో భర్త మ్యాచ్‌లు ఆడుతుంటే చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తుంటారు. ఇక స్టువర్ట్ బిన్నీ, బుమ్రా భార్యలైతే కామెంటేటర్లుగా మైదానంలో సందడి చేస్తుంటారు. అంతేకానీ బ్యాట్‌ పట్టి గ్రౌండ్‌లోకి దిగడం చాలా అరుదు. అయితే తాను మాత్రం అలా కాదంటోంది రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా. తాజాగా ఓ మ్యాచ్‌లో బ్యాట్‌ పట్టి బరిలోకి దిగిన ఆమె మెరుపులు మెరిపించింది. బౌండరీల వర్షం కురిపించింది. అంతేకాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టింది. ఇలా మొత్తానికి తన భర్తకున్న ఆల్‌రౌండ్‌ ట్యాగ్‌ను మరిపిస్తూ ఆల్‌రౌండ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. MLA ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీలో భాగంగా ఈ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. రివాబా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ భర్త జడేజాకు ఏమాత్రం తీసిపోరు’ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగింది రివాబా జడేజా. జామ్‌నగర్‌ నార్త్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థిపై 60 వేలకుపైగా భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీ లోకి అడుగుపెట్టింది. మరోవైపు రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్న అతను ఆల్‌రౌండ్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నారు. ఇప్పటివరకు సీఎస్‪కే 7 మ్యాచులు ఆడగా, ఐదింట విజయం సాధించి పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

రివాబా బ్యాటింగ్ వీడియో..

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..