Ravindra Jadeja
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సన్నాహకంగా టీమిండియా ఆడుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో విధ్వంసకర వికెట్ కీపర్ రిషభ్ పంత్, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు. పంత్ (94 బంతుల్లో 121 నాటౌట్) సెంచరీతో సత్తా చూపెట్టగా.. శుభ్‌మన్(135 బంతుల్లో 85) హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక
న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యుటిసి ఫైనల్‌కు ముందు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మూడో రోజు 2/22 గణాంకాలతో బంతితో మహ్మద్ సిరాజ్ ఆకట్టుకున్నాడు. ఇక బౌలింగ్‌లో పేసర్ ఇషాంత్ శర్మ(3/38) మూడు వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన ప్లేయర్లంతా రెండు జట్లుగా విడిపోయి ఆడుతున్న ఈ మ్యాచ్ శుక్రవారం మొదలైంది. అయితే, తొలి రోజు ఆటకు సంబంధించిన వివరాలు వెల్లడించిన బోర్డు.. శనివారం జరిగిన మ్యాచ్‌కు చెందిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. దాంతో పాటు పంత్, గిల్, ఇషాంత్ స్టాట్స్‌ను తెలిపింది.
కాగా బోర్డు విడుదల చేసిన మరో వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తమ ప్రత్యర్థి కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బౌలింగ్ చేస్తూ కనిపించాడు. కెప్టెన్ టు కెప్టెన్ అంటూ బోర్డు ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. మీడియమ్ పేస్ వేయగా.. ఆ డెలివరీ రిజల్ట్ ఏంటో కనిపెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సవాల్ విసిరింది. కాగా జూన్ 18న మొదలయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఎలాంటి కాంపిటేటిల్ మ్యాచ్ లేదు. దీంతో మెగా ఫైనల్‌కు తుది జట్టు ఎంపికలో ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ పెర్ఫామెన్స్‌లు కీలకం కానున్నాయి.